News

రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులు భారీ వర్ష సూచనా ..

Srikanth B
Srikanth B
రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులు భారీ వర్ష సూచనా ..
రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులు భారీ వర్ష సూచనా ..

రానున్న మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒకమోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచనలను జారీ చేసింది .

 

ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న 3 రోజులలో నల్లగొండ, హైదరాబాద్‌, యాదాద్రి-భువనగిరి, వికారాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం అవకాశం ఉందని ఆయా జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది.

రైతుల ఖాతాల్లో జమ కాకుండా రుణమాఫీ సొమ్ము వెనక్కి.. కారణం ఇదే

మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలలో పగటి పూట భారీ ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో జనం ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో గరిష్ట పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 32 డిగ్రీలపైనే నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 33.8 సెల్సియస్‌ డిగ్రీలు నమోదు కాగా. భద్రాచలంలో 32.8 , హన్మకొండలో 33, హైదరాబాద్‌లో 31.9, ఖమ్మంలో 34.8, మహబూబ్‌నగర్‌లో 30.8, మెదక్‌లో 32.6 డిగ్రీలు, నల్గొండలో 38 డిగ్రీలు, నిజామాబాద్‌లో 32.7 డిగ్రీలు, రామగుండంలో 33.6 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంతో పోలిస్తే నల్గొండలో అత్యధికంగా 4.5డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణశాఖ వెల్లడించింది.

రైతుల ఖాతాల్లో జమ కాకుండా రుణమాఫీ సొమ్ము వెనక్కి.. కారణం ఇదే?

Related Topics

#untimely rains

Share your comments

Subscribe Magazine