News

తెలంగాణాని వదలని వర్షాలు .. మరో 4 రోజులు పాటు వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌!

Srikanth B
Srikanth B

తెలంగాణను అకాలవర్షాలు వదిలేలా లేవు వర్షాకాలంలో కొనసాగి నేతలు గత నెల నుంచి తెలంగాలలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి , ఇది కోత సమయం కావడంతో రైతులు తీవ్ర ఆందోళకు గురువవుతున్నారు , అకాల వర్షాలు, వడగళ్ల వానలకు పంటలు దెబ్బతినడంతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన రైతులను వరి పంట చేతికందే సమయంలో వడగళ్ల వాన భయం వెంటాడుతోంది.

కొంచం మబ్బు పడితే చాలు రైతులు తీవ్రంగా భయపడిపోతున్నారు , ఎక్కడ అకాల వర్షాలు తమ పంటను నాశనం చేస్తాయో అన్న భయం రైతులను వెంటాడుతుంది . రాబోయే 48 గంటలు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఉరుములతో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

తెలంగాణాలో ధాన్యం సేకరణకు ఏర్పాట్లు .. ఏప్రిల్ 2 వ వారం నుంచి కొనుగోళ్లు !

రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్‌ వాతావరణకేంద్రం హెచ్చరికలు జారీ చేసింది . పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశ మందని హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ను జారీ చేసింది. ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని సూచించింది . తూర్పు మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు సముద్రమట్టం నుంచి 1.5కి.మీ. ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అయిదే రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

తెలంగాణాలో ధాన్యం సేకరణకు ఏర్పాట్లు .. ఏప్రిల్ 2 వ వారం నుంచి కొనుగోళ్లు !

Related Topics

Heavy Rain Alert

Share your comments

Subscribe Magazine