News

నెల్లూరు నుంచి భారీగా నిమ్మ ఎగుమతులు .. మార్చి తో పోలిస్తే తగ్గిన ధర !

Srikanth B
Srikanth B
Lemon exports from Nellore
Lemon exports from Nellore

నెల్లూరు జిల్లా పొదలకూరు, గూడూరు మార్కెటు నుంచి పెద్ద ఎత్తున్న నిమ్మ ఎగుమతి జరుగుతుంది , రోజుకే కనీసం 25 లారీల్లో లారీలలో రాష్ట్రము నుంచి నిమ్మకాయలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి తొలుత మార్చి నెలలో అయితే నిమ్మ ధర బస్తాకాయలు రూ.7,500 వరకు పలకగా ఇప్పుడు ఒక్కటింటికి రూ.4 వేల నుంచి రూ.5,500 వరకు ధర పలుకుతున్నాయి.

గత సంవత్సరం అయితే నిమ్మకాయ ధర గరిష్ఠంగా ఢిల్లీ మార్కెటలలో అయితే ఒక్క నిమ్మకాయనే రూ . 10 కి అమ్ముడు పోయింది ,ఇప్పుడు మాత్రం రూ . 7 నుంచి ఎనిమిది వరకు పలుకుతుంది మరో వైపు కొన్ని రోజులు వర్షాలు కురవడంతో వల్ల వినియోగం తగ్గి నిమ్మ ధరలు కాస్త తగ్గు ముఖం పట్టాయి .. తెలంగాణ రాష్ట్రం నకిరేకల్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల నుంచి సైతం నిమ్మకాయల ఎగుమతి పెరిగినట్లు తెలుస్తోంది. ఉత్తర భారతదేశంలోని ఢిల్లీతో పాటు, లక్నో, వారణాసి, మధుర, గోరఖ్‌పూర్‌, అలహాబాద్‌ తదితర ప్రాంతాలకు కాయల ఎగుమతి చేస్తున్నారు , ఎగుమతి అవుతున్న కాయలు కేవలం గృహ అవసరాలకోసమే వినియోగిస్తున్నట్లు సమాచారం .

ఈ జిల్లాలో భారీ వర్షాలు..ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

ఎందుకంటే వేసవిలో అధిక ఎండల కారణంగా శీతల పానీయాలలో అధికంగా నిమ్మకాయల వాడకం అధికంగా ఉంటుంది కాబ్బట్టి నిమ్మకాయల వినియోగం అధికంగా ఉండడం ద్వారా ధరలు అధికంగా ఉంటాయి దీనితో పరిశ్రమలు నిమ్మకాయలను కేవలం శీతాకాలం లోనే దిగుమతి చేసుకుంటాయి .

ఈ జిల్లాలో భారీ వర్షాలు..ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Share your comments

Subscribe Magazine