News

హైదరాబాద్ మెట్రో రికార్డు ఒక్కరోజులో ప్రయాణించింది ఎంతమంది అంటే ?

Srikanth B
Srikanth B
హైదరాబాద్ మెట్రో రికార్డు ఒక్కరోజులో ప్రయాణించింది ఎంతమంది అంటే ?
హైదరాబాద్ మెట్రో రికార్డు ఒక్కరోజులో ప్రయాణించింది ఎంతమంది అంటే ?

హైదరాబాద్ విశ్వనగరం వైపు వడివడిగా అడుగులు వేస్తుంది , దేశంలోనే జనాభా పరంగా దేశంలోనే 6 అతిపెద్ద పట్టణంగా ఉన్న హైదరాబాద్ కు మెట్రో మరొక మణిహారం 2019 లో ప్రారంభమైన మెట్రో పరుగులు దిన దినాభివృద్ది చెందుతూ రోజుకు రోజుకు ప్రయాణించి వారి సంఖ్య 5 లక్షల మార్కును దాటి కొత్త రికార్డు సృష్టించింది.

ఈ నెల 3వ తేదీన 5.10 లక్షల మంది మెట్రోలో ప్రయాణించి రికార్డు స్థాయిలో హైదరాబాద్ మెట్రో రైలు మైలురాయిని సాధించింది. మెట్రో రైలు ప్రారంభమైన తర్వాత ప్రయాణికుల సంఖ్య 5 లక్షల మార్కును దాటడం ఇదే తొలిసారి. ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ కేవీబీ రెడ్డి, ప్రయాణికులు తమకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా రానున్న రోజుల్లో మరిన్ని మెట్రో ట్రిప్పులు అందుబాటులోకి రానున్నాయని ఆయన పేర్కొన్నారు. మెట్రో కారిడార్‌లలో, మియాపూర్-ఎల్‌బి నగర్ కారిడార్ ప్రయాణికుల సంఖ్యలో అగ్రస్థానంలో ఉంది, సోమవారం ఈ మార్గంలో 2.60 లక్షల మంది ప్రయాణించారు, నాగోల్-రాయదుర్గం కారిడార్ రెండవ స్థానంలో ఉంది, ఈ మార్గంలో 2.25 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కాగా, రాయదుర్గం స్టేషన్‌లో అత్యధికంగా 32,000 మంది ప్రయాణికులు రాగా, 30,000 మందితో ఎల్‌బీ నగర్‌ రెండో స్థానంలో ఉంది. అమీర్‌పేటలో 29,000 మంది, మియాపూర్‌లో 23,000 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఎన్‌విఎస్‌రెడ్డి తెలిపారు.

Related Topics

dog attacks in hyderabd

Share your comments

Subscribe Magazine