News

రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచనా .. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ !

Srikanth B
Srikanth B

ఎండా వేడి ,ఉక్కపోత ద్వారా ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలను చల్లటి వర్షపు జల్లులు తాకనునట్లు వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది , దీనితో ఎండా నుంచి ప్రజలకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది . గత కొన్ని రోజులగా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతల స్థాయిలు పెరుగుతున్న విషయం తెలిసిందే మరోవైపు మర్చి చివరి నాటికీ 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకోనున్నాయి .

ఈ క్రమంలో బానుడి భగభగల నుంచి ఉపశమనం లభించనున్నట్లు వాతావారణ విభాగం అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి ఏర్పడినట్లు తాజాగా వాతావరణ వాతావరణ శాఖ తెల్పింది. దీని ప్రభావం వల్ల దేశంలోని తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి గత రెండు, మూడు రోజులుగా దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయి. వాతావరణంలో కూడా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఎండ వేడి తీవ్రత తగ్గి, చల్లని గాలులు వీస్తున్నాయి.

కలవర పెడుతున్నహెచ్3ఎన్2 కొత్త వైరస్ లక్షణాలు ఇవే !

దీంతో మార్చి 20వ తేదీ వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నట్లు అధికారులు తెలియజేశారు. మరోవైపు శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలన్నీ సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సాధారణం కన్నా 2.6 డిగ్రీలు తక్కువగా 32.7 డిగ్రీల సెల్సియస్‌ నమోదయింది. ఇక ఈ నెల 16వ తేదీ అనంతరం పలు జిల్లాల్లో చిరు జల్లులు కురవనున్నట్లు అధికారులు సూచిస్తున్నారు.

కలవర పెడుతున్నహెచ్3ఎన్2 కొత్త వైరస్ లక్షణాలు ఇవే !

Related Topics

Heavy Rain Alert

Share your comments

Subscribe Magazine