News

సెప్టెంబర్ లో మళ్లి వర్షలు..

Srikanth B
Srikanth B
సెప్టెంబర్ లో మళ్లి వర్షలు..
సెప్టెంబర్ లో మళ్లి వర్షలు..

గత వందేళ్లలో ఎన్నడూ లేని విదంగా ఇ సంవత్సరం దేశవ్యాప్తంగా అతి తక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. సెప్టెంబరులో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షలు మళ్లి నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకుని వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా విడుదల చేసింది.

రానున్న వారాం లోనే దక్షిణాదిలో, మధ్య భారతంలో వానలు పడతాయని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. సెప్టెంబరు నెలకు దీర్ఘకాల సగటు వర్షపాతం 167.9 మి.మీ. కాగా దానిలో 9% అటూఇటూగా నమోదవుతుందని చెప్పారు. ఒకవేళ ఎక్కువగా కురిసినా జూన్‌-సెప్టెంబరు వానాకాలపు సగటు వర్షపాతం మాత్రం సాధారణం కంటే తక్కువగానే ఉండవచ్చని అంచనా వేశారు.

ఆంధ్రప్రదేశ్  లో లోటు 54 శాతం లోటు వర్షపాతం ..

'జులైలో అధిక వర్షాలు పడిన తర్వాత ఆగస్టులో రుతుపవనాలు జాడైన కనిపించలేదు. నెలలో కోన్నిప్రాంతలలో 20 రోజులపాటు ఎక్కడా చినుకుపడలేదు. ఎల్‌నినో పరిస్థితులు దీనికి కారణంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు . అరేబియా మహా సముద్రం, బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం వల్ల ఇప్పుడు ఎల్‌నినో సానుకూలంగా మారడం మొదలైంది. దీంతోపాటు తూర్పుదిశగా మేఘాల పయనం, ఉష్ణమండల ప్రాంతాల్లో వర్షపాతం వంటివీ రుతుపవనాల పునరుద్ధరణకు అనుకూలంగా మారుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది' అని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్  లో లోటు 54 శాతం లోటు వర్షపాతం ..

Related Topics

andhrapradesh rains

Share your comments

Subscribe Magazine