News

రబ్బర్ పండించే రైతులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం ...

KJ Staff
KJ Staff

రానున్న రెండు ఆర్ధిక సంవత్త్సరాలకి కేంద్ర ప్రభుత్వం నేషనల్ రబ్బర్ స్కీం 708. కోట్ల రూపాయిలు కేటాయించనుంది అని కామర్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రటరీ అంర్దీప్ సింగ్ భాటియా తెలిపారు. ఈ స్కీం కారణంగా ఎంతో మంది రబ్బర్ పంట రైతులు లబ్ది చెందబోతున్నారు. ఐతే ఇంపోర్ట్ డ్యూటీ లో మాత్రం ఎలాంటి మార్పులు లేవని అమరదీప్ సింగ్ వెల్లడించారు

ప్రస్తుతానికి రబ్బర్ ఫై ఇంపోర్ట్ డ్యూటీ కిలోకి 25% (కిలోకి 29రూ ) ఉండగా, టైర్ ఉత్పత్తి కంపెనీలు దీనిపై పునరసమిక్ష జరపాలి అని కోరుతున్నారు

నిధుల వినియోగం:
కేటాయించిన నిధులు ఎలా వినియోగిస్తారో ప్రశ్నించగా స్పందించిన అమరదీప్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. అదనంగా కేటాయించిన నిధులతో రబ్బర్ రైతుల ట్రైనింగ్కు, మొక్కలు ఉత్పత్తి,రబ్బర్ సొసైటీస్ ఏర్పాటు చెయ్యడానికి ఉపయోగిస్తాం అని తెలిపారు.

పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని రబ్బర్ ఎక్కువగా ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో సహాయక రుసుము ను 25,000రూ నుండి 40,000 కు పెంచుతున్నట్లు అమరదీప్ సింగ్ తెలిపారు .

గత ఏడాది మన దేశంలో 13. లక్షల టన్నుల రబ్బర్ వినియోగం కాగా, రబ్బర్ అధికంగా పండించే కేరళలో 8. లక్షల టన్నుల రబ్బర్ ఉత్పత్తి అయ్యింది అని అయన తెలిపారు. డిమాండ్ కు తగ్గట్టు రబ్బర్ ప్రొడక్షన్ పెంచేందుకు ఆఫ్రికా, వియత్నాం, మలేషియా వంటి దేశాల నుండి రబ్బర్ మొక్కలు దిగుమతి చేసేందుకు కృషి చేస్తాం అని అయన చెప్పారు.

Share your comments

Subscribe Magazine