News

ఊపందుకున్న చక్కెర ఎగుమతులు, సుమారుగా 550,000 టన్నుల ఎగుమతికై ఒప్పందాలు.

S Vinay
S Vinay


అంతర్జాతీయ స్థాయిలో చక్కర ఎగుమతుల్లో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. భారతీయ చక్కెర మిల్లులు తాజాగా 550,000 టన్నుల చక్కర ను ఎగుమతి చేయడానికి ఒప్పందాలపై కుదుర్చుకున్నాయి అంతర్జాతీయంగా చక్కెర ధరలు పెరగడం అదే సమయానికి రూపాయి విలువ పడిపోవడం వంటి అంశాలు విదేశీ అమ్మకానికి లాభదాయకంగా మారాయి.

 

గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర మరియు కర్ణాటకకు చెందిన చక్కెర మిల్లులు మార్కెట్‌లో చురుకుగా ఉన్నాయి.మిల్లుల యజమానులు విదేశీ ఎగుమతిపైనే ఎక్కువ ద్రుష్టి సారించారు.భారతీయ చక్కెర మిల్లులు 2021-22 సంవత్సరానికి గాను 6.4 మిలియన్ టన్నుల చక్కెరను విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఒప్పొందాలు కుదుర్చుకున్నాయి ఐతే ఇందులో ఇప్పటికే దాదాపుగా 5 మిలియన్ టన్నుల చక్కెర విదేశాలకి ఎగుమతి జరిగింది.
గడిచిన కాలంలో ప్రభుత్వ అందించే సబ్సిడీని సద్వినియోగపరుచుకొని అత్యధికంగా 7.2 మిలియన్ టన్నుల చక్కెరను విదేశాలకు ఎగుమతి చేయడం జరిగింది. విదేశీ ఎగుమతులపై ఎలాంటి ఆంక్షలు విధించనట్లయితే ఈ సంవత్సరం సుమారుగా 8 మిలియన్ టన్నుల వరకు ఎగుమతి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

2021-22 సంవత్సరానికి అత్యధికంగా 33.3 మిలియన్ టన్నుల చక్కెరను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది, ఇది గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 7 శాతం అధికంగా ఉంది.

భారతదేశంలో మహారాష్ట్ర మరియు కర్ణాటకలో చక్కెర ఉత్పత్తి అధికంగా ఉంది మహారాష్ట్ర లో చక్కెర ఉత్పత్తి 11.7 మిలియన్ టన్నులు అని అంచనా వేయగా ఇప్పుడు 12.6 మిలియన్ టన్నులకు చేరుకునే అవకాశం ఉంది. కర్ణాటకలో చక్కర ఉత్పత్తి సుమారుగా 5. మిలియన్ టన్నులకు అంచనా వేయ బడింది.

విదేశీ ఎగుమతులు పెరగడం ద్వారా దేశంలో చక్కెర నిల్వలు నియంత్రణలో ఉండటమే కాకుండా స్థానిక ధరలకు మద్దతు లభిస్తుంది .

మరిన్ని చదవండి.

గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశానికై దరఖాస్తుల ఆహ్వానం, చివరి తేదీ మార్చ్ 28

1 రూపాయి నాణెం తయారు చేయడానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా ?

Share your comments

Subscribe Magazine