News

మాండౌస్‌ తుఫాన్‌ ప్రభావం మరో 3 రోజులు .. నిలిచిపోయిన వడ్ల కొనుగోళ్లు ..

Srikanth B
Srikanth B
Mandaus cyclone update
Mandaus cyclone update



మాండౌస్‌ తుఫాన్‌ ప్రభావంతో అటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. మాండౌస్‌ తుఫాన్‌తో పాటు బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడిందని రానున్న 2 నుంచి 3 రోజుల పాటు తెలుగు రాష్ట్ర వ్యాప్తముగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి IMD హైదరాబాద్ శాఖ వెల్లడించింది . మరో వైపు ఆకాల వర్షాల కారణం గ తెలంగాణ వ్యాప్తముగా ఐకేపీ సెంటర్లలో వడ్ల కొనుగోళ్లు నిలిచి పోయాయి . ఇప్పటికే ధాన్యం బాగా ఎండిపోయి ఉండడంతో రానున్న 3 రోజులు కనుక వర్షాలు కొనసాగితే వడ్లు మొలకైతే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .

సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ..బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి సాయంత్రం వాయుగుండంగా మారడంతోపాటు తీవ్ర అల్పపీడనంగా మారిందని పేర్కొంది. దీని ప్రభావంతో ఉరుములు ,మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతాహవారణ శాఖ తెలిపింది .

మాండౌస్‌ తుఫాన్‌ ప్రభావంతో హైదరాబాద్ నగరం అంత ముసురుపట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తముగా శనివారం సాయంత్రం నుంచి మోస్తారు వర్షం కురుస్తోంది.

మాండూస్ తుఫాన్ .. AP లోని ఈ 6 జిల్లాలోనే అధిక ప్రభావం ..హెచ్చరిక జారీ !

మరో వైపు మాండౌస్‌ తుఫాన్‌ ప్రభావం ఆంద్రప్రదేశ్ లోని ఆరు జిల్లాల్లోని 32 మండలాల్లో తుపాను ప్రభావం అధికముగా ఉందని .. లోతట్టు ప్రాంతాల నుంచి 708 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకి తరలించామన్నారు. 33 సహాయక శిబిరాలని ఏర్పాటు చేసామని, 778 మందికి పునరావాసం కల్పించామని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో భోజనం, తాగునీరు సదుపాయం కల్పించామన్నారు. సహాయక చర్యలకోసం ప్రకాశం జిల్లాలో 2, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 3, తిరుపతి జిల్లాలో 2, చిత్తూరు జిల్లాలో 2 మొత్తంగా 5 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపించామన్నారు.

మాండూస్ తుఫాన్ .. AP లోని ఈ 6 జిల్లాలోనే అధిక ప్రభావం ..హెచ్చరిక జారీ !

Share your comments

Subscribe Magazine