News

2023 ఫిబ్రవరి 1 నుంచి మేడారం జాతర !

Srikanth B
Srikanth B

ఆసియాలోనే అతిపెద్ద జాతర పండుగలలో ఒకటైన మేడారం జాతర 2023 ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు నిర్వహించనున్నట్లు మేడారం ఆలయ ట్రస్ట్ కమిటీ మంగళవారం ప్రకటించింది.

రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ద్వైవార్షిక జాతరను నిర్వహిస్తుండగా, ఆలయ పూజారులు ఈ మధ్య సంవత్సరంలో భక్తుల అభ్యర్థన మేరకు మినీ జాతర (మండ మెలిగే) నిర్వహిస్తారు.
సమ్మక్క-సారలమ్మ మేడారం ఆలయ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 1న ఆలయ శుద్ధి, పూజలు, గ్రామ బహిష్కరణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కాశ్మీరీ కుంకుమపువ్వు కు GI ట్యాగ్, కిలో కు 5 లక్షలు !

ఫిబ్రవరి 2న సమ్మక్క, సారలమ్మ దేవతలకు పసుపు, పచ్చిపూలతో పూజలు నిర్వహిస్తారు. మండ మెలిగే ఆచారం ఫిబ్రవరి 3, 4 తేదీల్లో జరగనుంది. గిరిజన జాతరకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను పూజారుల సంఘం కోరింది.

కాశ్మీరీ కుంకుమపువ్వు కు GI ట్యాగ్, కిలో కు 5 లక్షలు !

Share your comments

Subscribe Magazine