News

MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్ 2024: కొల్హాపూర్, మహారాష్ట్ర

KJ Staff
KJ Staff

భారత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తూవస్తున్న, MFOI సంరిద్ కిసాన్ ఉత్సవాలు, ఇప్పుడు మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలోని విశేషాల కోసం ఆర్టికల్ చివరి వరకు చదవండి.

MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్:

వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసి, అధిక ఉత్పాదకత ద్వారా ఎక్కువ లాభాలు పొందుతున్న రైతులను, మిల్లియనీర్ ఫార్మర్ అఫ్ ఇండియా అవార్డులతో సత్కరించడం జరుగుతుంది. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంతో పాటు కృషీ ఉత్సవాల కూడా నిర్వహించడతాయి. ఈ ఉత్సవాల్లో, అనేక వ్యవసాయ పనిముట్లు, రైతులకోసం ప్రదర్శనగా ఉంచబడతాయి. అంతే కాకుండా వ్యవసాయ అధికారులు, వైజ్ఞానికులు కిసాన్ ఉత్సవానికి హాజరు అవుతారు. వీరు వ్యవసాయంలో సాంకేతికలను రైతులకు తెలియచేస్తారు. రైతులు తమ అనుభవాలను మిగతా రైతులతో పంచుకునేందుకు ఇది ఒక మంచి వేదిక.

ఈ ఉత్సవం మార్చ్ 15, 2024, అంటే ఈ రోజు మహారాష్ట్ర కొల్హాపూర్లోని, కనేరి కృషి విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. Dhanuka Agritech Pvt Limited ద్వారా ఆధారితమైన MFOI సంరిద్ కిసాన్ ఉత్సవాల్లో అనేక కార్యక్రమాలు ఎన్నో విజ్ఞానాత్మకమైవున్న కార్యక్రమాలు చోటు చేసుకోబోతున్నాయి

మార్చ్ 12, 2024 మహారాష్ట్ర సతారాలో నిర్వహించిన, MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్ కార్యక్రమం, విశేషమైన జనాదరణ సొంతంచేసుకుంది. ఎంతో మంది ప్రగతిశీల రైతుల ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రైతులతో పాటు వ్యవసాయ అధికారులు పాల్గొని, రైతులకు చెరుకు పంట యాజమాన్య పద్దతులపై సూచనలను అందించారు. 200 కంటే ఎక్కువ మంది రైతుల రాకతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా.

వ్యవసాయం ద్వారా వచ్చే నికర ఆదాయం సంవత్సరానికి 10 లక్షల కంటే ఎక్కువ ఉంటె వారిని మిల్లియనీర్ ఫార్మర్స్గా గుర్తించి వారిని మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డులతో సత్కరించడం జరుగుతుంది. కొల్హాపూర్ లో జరుగుతున్న ఈ రోజు కార్యక్రమంలో ఈ ప్రాంతంలో వ్యవసాయానికి విశేష సేవ చేస్తున్న, లక్షధికారి రైతులను మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా బిరుదుతో సత్కరించడం జరుగుతుంది. అక్కడ ప్రగతిశీల రైతుగా పేరొందిన, గణపతి పవర్ గారు అతని విజయ గాథను రైతులతో పంచుకోనున్నారు.

వ్యవసాయ అధికారులు సూచనలు అందించడం:

ముందుగా కనేరి కృషి విజ్ఞాన్ కేంద్రం, పంట సంరక్షణ విభాగానికి చెందిన అధికారి డా. పరాగ్ తురకడే, చెరుకు పంటకు పట్టే చీడ పీడల గురించి వాటి నివారణ పద్ధతుల గురించి రైతులకు తెలిచేస్తారు. తర్వాత చిరు ధాన్యాల విశిష్టతను, రైతులకు తెలియచేసేందుకు, కృషి విజ్ఞాన కేంద్రం అధికారిణి, ప్రతిభ తొంబ్రే ప్రసంగిస్తారు. డా. వర్షిణి రాణి వాఘ్, పాడిపశువుల యాజమాన్య సూచనలు రైతులకు అందచేస్తారు. డా. రవీంద్ర సింగ్, కృషి విజ్ఞాన్ కేంద్రం రైతులకు ఎటువంటి సేవలను అందిస్తుందో అలాగే రైతులకు కోసం ప్రవేశపెట్టిన స్కీమ్స్ ఎలా వినియోగించుకోవాలో తెలియపరుస్తారు.

MFOI అవార్డ్స్ ప్రధానోత్సవం:

గత 27 సంవత్సరాలుగా. వ్యవసాయ అభున్నతికి ఎంతగానో కృషి చేస్తుంది, కృషి జాగరణ్. కృషి జాగరణ్, భారత దేశంలోనే, ప్రధాన అగ్రికల్చరల్ మీడియా హౌస్. రైతులకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను కృషి జాగరణ్ నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డులను, రైతుల ముందుకు తీసుకువచ్చింది. నేటి కొల్హాపూర్, కార్యక్రమంలో కొందరు లక్షాధికారి రైతులను సత్కరించడం జరుగుతుంది. వారికీ సన్మానం చెయ్యడం ద్వారా మిగిలిన రైతులకు కూడా స్ఫూర్తిని, వ్యవసాయం పట్ల ప్రేరణను అందించవచ్చు. రైతుల సమగ్ర కృషి ద్వారా భారతీయ వ్యవసాయ స్థితిగతులను మార్చే అవకాశం ఉంటుంది.

Mahindra ట్రాక్టర్లు:

అన్ని వ్యవసాయ పనులకు ధీటుగా ట్రాక్టర్లను రూపొందించడంలో మహీంద్రా ట్రాక్టర్స్ భారత దేశంలోనే అత్యుత్తమమైనది. MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్ స్పాన్సర్ మహీంద్రా ట్రాక్టర్స్ ఈ కార్యక్రమంలో తమ ట్రాక్టర్లను ప్రదర్శనలో ఉంచుతారు. నిపుణుల ద్వారా సమాచారాన్ని పొంది, రైతులు తమ వ్యవసాయ పనులకు అనుగుణంగా ట్రాక్టర్ను ఎంచుకునే అవకాశం. అంతే కాకుండా ఎన్నో అగ్రిటెక్ కంపెనీలు ఈ కార్యక్రమంలో తమ స్టాళ్లను ఏర్పాటు చేసి తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచుతారు. రైతులు వారికి అవసరమైన ఉత్పత్తులను అక్కడే కొనుగోలు నేరుగా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది.

Share your comments

Subscribe Magazine