News

MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్: మీరట్, హస్తినాపుర్:

KJ Staff
KJ Staff

రైతులను MFOI అవార్డులతో సత్కరించే, కిసాన్ సంరిద్ ఉత్సవ్ ఇప్పుడు, ఉత్తర్ ప్రదేశ్ మీరట్, హస్తినాపుర్ లో మొదలైంది. ఈ కార్యక్రమంలో యొక్క విశేషాలు ఈ ఆర్టికల్ ద్వారా చదివి తెలుసుకోండి.

వ్యవసాయంలో విశేష కృషి చేసి, అత్యుత్తమ విజయాలు సాధించిన ధనవంతులైన రైతులను సత్కరించాడనికి మొదలు పెట్టిన మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డులు. ఈ మార్చ్ నెలలో అనేక ప్రదేశాల్లో అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే 13 మార్చ్, 2024 న, అంటే ఈ రోజు, ఉత్తర్ ప్రదేశ్లోని, మీరట్, హస్తినాపుర్ కృషి విజ్ఞాన కేంద్రం వేదికగా , MFOI సంరిద్ కిసాన్ ఉత్సవాని నిర్వహించబోతున్నాము. రైతులకు ఉపయోగపడే అనేక విజ్ఞానాత్మకమైన కార్యక్రమాలు ఉండబోతున్నాయి. Dhanuka Agritech limited ద్వారా ఆధారితమైన ఈ కార్యక్రమం ఎంతో ప్రత్యేకమైనది.

వ్యవసాయం ఒక విధంగా జూదం అని చెప్పుకోవచ్చు. జూదంలో ఎలా ఐతే పెట్టిన డబ్బు వెన్నక్కి వస్తుంది అని నమ్మకం లేదో అలాగే వ్యవసాయంలో కూడా రైతులకు లాభం వస్తుంది అని నమ్మకం లేదు. కానీ జూదం ఆడచ్చా లేదా అనేందుకు అవకాశం ఉంటుంది. రైతులకు మాత్రం ఆ అవకాశం ఉండదు. వ్యవసాయంలో కష్టం, నష్టం ఎంత ఉన్న రైతు మాత్రం వ్యవసాయాన్ని వీడదు. వ్యవసాయంలో వచ్చే ఎన్నో ఒడిదుడుకులని తట్టుకుని నిలబడి, వ్యవసాయం ద్వారా లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్న రైతులను సన్మానించడం, అత్యంత అవసరం. దీనికోసం రూపొందించినవే ఈ మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డులు. MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్ కార్యక్రమాలు ఒక ఊరికో లేదా ఒక రాష్ట్రానికో పరిమితం కాదు, భారత దేశంలోని ప్రతీ రాష్ట్రంలో ఈ అవార్డు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వ్యవసాయ అభ్యునతికి విశేష కృషి చేస్తున్న రైతులను సత్కరించే ఒక వినూత్న కార్యక్రమాన్ని కృషి జాగరణ్ ప్రారంభించింది. కృషి జాగారం గత 17 సంవత్సరాల నుండి రైతుల మేలు కోసం ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో రూపొందించ్చిందే MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్ కార్యక్రమాలు.

ఈ కార్యక్రమం ఇప్పుడు మీరట్ లోని హస్తినాపుర్ కృషి విజ్ఞాన్ కేంద్రం వేదికగా జరగనుంది. ఈ కార్యక్రమంలో, ధనుక అగ్రిటెక్ లిమిటెడ్ తో పాటు అనేక వ్యవసాయ అనుబంధ కంపెనీలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. వ్యవసాయానికి అవసరమయ్యే ఎన్నో విధాల పనిముట్లను, విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందులు ఈ కార్యక్రమంలో ప్రదర్శనగా ఉంచుతారు. రైతులు వాటి పనితీరుని స్వయంగా చూసి తెలుసుకోవచ్చు.

ప్రగతిశీల రైతులకు సన్మానం:

మీరట్, హస్తినాపుర్ వేదికగా జరుగుతున్న ఈ MFOI కిసాన్ సంరిద్ ఉత్సవానికి వ్యవసాయ అధికారులు, కృషి విజ్ఞాన్ కేంద్ర శాస్త్రవేత్తలు విచ్చేసారు. మరో ప్రత్యేకత ఏమిటంటే 250 కంటే ఎక్కువ మంది రైతులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. హస్తినాపుర్ ప్రాంతంలో, వ్యవసాయ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న 25 మంది ప్రగతిశీల రైతులను ఈ క్రయక్రమంలో సన్మానించడం జరిగింది. అవార్డు గ్రహీతలు వ్యవసాయంలో తాము ఎదురుకున్న సమస్యల్ను, మరియు వాటికీ పరిష్కరాన్ని మిగిలిన రైతులతో పంచ్చుకున్నారు

మిల్లియనీర్ ఫార్మర్ అవార్డులు అంటే ఏమిటి వాటికీ అర్హులు ఎవరు?

MFOI అవార్డు అందుకునేందుకు సొంత వ్యవసాయ భూమి కలిగి ఉండాలి. మీ యొక్క కృషి మరియు పట్టుదలతో, వ్యవసాయంలో విభిన్న పద్దతుల ద్వారా అకాండ విజయాలు సాధించి, ఉండాలి. దీనితో పాటు వ్యవసాయం ద్వారా మీకు వచ్చే ఆదాయం లక్షల్లో కనుక ఉన్నట్లైయితే మీరు మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డును పొందేందుకు అర్హులు.

MFOI అవార్డు రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్టర్ అవ్వండి: https://millionairefarmer.in/

Share your comments

Subscribe Magazine