News

అసాధ్యం అనుకున్న కార్యాన్ని, సుసాధ్యం చేసిన కృషి జాగరణ్:

KJ Staff
KJ Staff

భారత దేశంలోనే ప్రముఖ అగ్రి మీడియా హౌస్, కృషి జాగరణ్, వ్యవసాయ రంగంలో అభున్నతికి ఎంతగానో కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో 23 ఫిబ్రవరి శుక్రవారం రోజున ఎంఎఫ్ ఓ ఐ సంరిద్ కిసాన్ ఉత్సవ్ 2024 ను, ఉత్తర్ ప్రదేశ్ లోని లక్మిపుర కెహెరి లో ఘనంగా ప్రారంభించింది . ఇక్కడ రైతులకు కేతి బడి తో ముడిపడి ఉన్న కొత్త వ్యవసాయ విధానాలు తెలియచేయడం తో పటు, రైతులకు మిల్లియనీర్ ఫార్మర్ అఫ్ ఇండియా (MFOI) అవార్డులతో సత్కరించనున్నారు.

హాజరైన కేంద్ర మంత్రి, అజయ్ కుమార్ మిశ్ర టెని:

వ్యవస్యాయ జర్నలిజంలో, తమదయిన పేరును సంపాందించుకుంటూ గత 27 సంవత్సరాలగ, విఖ్యాత మీడియా హౌస్ కృషి జాగరణ్ రైతులు మరియు వ్యవసాయ క్షేత్రాలలో అభివృద్ధి కోసం పని చేస్తుంది. ప్రతి సంవత్సరం కృషి జాగరణ్, రైతులకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఎంఎఫ్ఓఐ సంరిద్ కిసాన్ ఉత్సవ్ 2024 ను ప్రారంభించి. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్ర మంత్రి శ్రీ. అజయ్ కుమార్ మిశ్ర టెలి హాజరు అయ్యారు. కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, కృషి జాగరణ్ అందరు అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసింది, అని అయన అన్నారు. మహీంద్రా ట్రాక్టర్లు తో పాటు, వ్యవసాయ రంగంతో అనుభందం ఉన్న అనేక కంపెనీలు, కృషి వైజ్ఞానికులు, వ్యవసాయ విభాగం అధికారులు, మిల్లియనీర్ ఫార్మర్లు, ఎంతో మంది ప్రగ్న్యశీలి రైతులు పాలుపంచుకున్నారు.

మిల్లియనీర్ రైతులకి సత్కారం

ఈ ఉత్సవం ముఖ్యంగా భారత దేశ రైతుల ఆదాయాన్ని పెంచి, దేశ ఆర్ధిక వ్యవస్థను బలపరిచే అంశంపైనా రూపొందించబడింది. ఈ ధోరణిలో, ఉత్సవానికి విచ్చేసిన వ్యవసాయ వైజ్ఞానికులు, రైతు బడికి సంభందం ఉన్న కొత్త వ్యవసాయ పద్దతులు రైతులకు తెలియచేసారు. తద్వారా రైతులు ఆ పద్ధతులు తమ పొలాల్లో ఉపయోగించి వారి ఆదాయాన్ని పెంచుకోవచ్చు అని వారు తెలియచేసారు. అంతే కాకుండా కృషి జాగరణ్ విశేషంగా ప్రారంభించిన, MFOI అవార్డుల గురించి జాగృతం చేసారు. MFOI అంటే ఏమిటి? ఈ అవార్డుల వాళ్ళ రైతులకు కలిగే లాభాలను తెలియపరిచారు. వ్యవసాయంలో గొప్ప పనులు చేస్తున్న రైతులను సన్మానించారు. ఈ ఉత్సవానికి ముఖ్య అతిధిగా హాజరు అయినా శ్రీ. అజయ్ కుమార్ మిశ్ర టెలీ గారు రైతులకు సన్మాన పత్రాలను, అవార్డులను అందజేశారు.

రైతే భారత దేశం వెన్నుముక :

కృషి జాగరణ్ వ్యవస్థాపకులు, మరియు ముఖ్య సంపాదకులు అయినా ఎం. ఎస్. డొమినిక్ ఈ విధంగా సంబోధించారు. "నేను ఒక రైతును , వ్యసాయంలో వచ్చే ఆటు పోట్లు, కష్ట నష్ఠాలు అన్ని నాకు బాగా తెలుసు". రైతులు పగలనక రాత్రనక, కష్టపడి సేద్యం చేస్తారు అని, వారి కష్ట ఫలితమే ఈరోజు మనం ఆహారంగా తీసుకుంటున్నాం అని ఆయన చెప్పారు. అటువంటి రైతు కష్ఠాన్ని గుర్తించి వారిని సన్మానించడం ఎంతగానో అవసరం అని డొమినిక్ తెలిపారు. ఈ ఆలోచన లో భాగంగానే MFOI అవార్డులను రుపొంచించాం అని అయన తెలియచేసారు.

 

ప్రపంచవ్యాప్తంగా ఉండే రైతులను ఒక్కటి చేసే ఆలోచన:

2023 డిసెంబర్ లో మొదలు అయ్యి ఇంకా కొనసాగుతున్న MFOI గణ విజయం తర్వాత, ఈ సంవత్సరం డిసెంబర్ లో మరోసారి ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తాం. అయితే ఈ సరి ఒక్క భారత దేశంలోనే కాకుండా ప్రపంచం అంత ఉన్న వేర్ వేరు దేశాల్లో MFOI కార్యక్రమాన్ని ప్రారంభిచబోతున్నారు. ప్రపంచం లో ఉండే రైతులు అందరిని జోడించడం వల్ల, విజ్ఞానామ్ వ్యాప్తి చెంది. ప్రపంచంలో ఉండే రైతులు అందరికి ఎంతో మేలు చేస్తుంది.

రైతుల హితం కోసం కృషి చేస్తున్న సర్కార్:

ముఖ్య అతిధిగా హాజరు అయినా శ్రీ. అజయ్ కుమార్ మిశ్ర, దేశంలో బిజేపి సర్కారు వచ్చిన తర్వాత రైతుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తుంది అని కేంద్ర మంత్రి తెలిపారు. మోడీ ప్రభుత్వం ప్రారంభించిన అనేక కార్యాలు వ్యవసాయదారులకు ఎంతో మేలును కలిగించాయి అని, వీటి ద్వారా రైతుల ఆదాయం పెరిగింది అని అన్నారు. ఈ పథకాల ఫలితంగానే నేడు వ్యవసాయ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రైతులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నారని అన్నారు.

Share your comments

Subscribe Magazine