News

MFOI "వివిఐఎఫ్ కిసాన్ భరత్ యాత్ర"- (మధ్య మరియు ఈశాన్య రాష్ట్రాల్లో )

KJ Staff
KJ Staff

నిన్న అంటే మార్చ్ 6, 2024 న ఉత్తర్ ప్రదేశ్, ఝాన్సీలో మొదలైన వీవీఐఎఫ్ కిసాన్ భరత్ యాత్ర, రెండో రోజుకు ఏయే ప్రాంతాల్లో సంచరించిందో ఇప్పుడు తెలుసుకోండి.


కిసాన్ భరత్ యాత్ర:

2023, డిసెంబర్ లో మొదలై, ఇప్పటివరకు నిర్విరామంగా కొనసాగుతుంది MFOI వీవీఐఎఫ్ కిసాన్ భరత్ యాత్ర. భారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సంచరిస్తూ, వివిధ ప్రాంతాల రైతులను మమేకం చేసుకుంటూ ఈ యాత్ర ముందుకు సాగుతుంది. భారత దేశ రైతుల విజయాలను ప్రపంచం ముందు ఉంచడానికి ఈ యాత్ర ప్రయత్నిస్తుంది. ఉత్తర మరియు దక్షిణ భారత దేశంలో చాలా ప్రాంతాలకు చేరుకుంది ఈ యాత్ర. ఇప్పుడు మధ్య, పశ్చిమ రాష్ట్రాలను చేరుకునేందుకు యాత్ర రధం శసిద్ధం అయ్యింది.

రాణి లక్ష్మి భాయ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఝాన్సీ లో ప్రారంభమైన వివిఐఎఫ్ కిసాన్ భరత్ యాత్ర, పార్వతిపూర్ నయాఖేడా వద్దకు చేరుకుంది. ఈ ప్రాంతంలోని రైతులతో మా వ్యవసాయ వైజ్ఞానికులు సంభాషించారు. రైతులు తమ వ్యవసాయంలో ఎదురుకుంటున్న, సమస్యల గురించి తెలియచేసారు. వైజ్ఞానికులు వాటికి సూచనలు అందచేసారు. వారందరికి MFOI అవార్డుల గురించి తెలియచెయ్యడం జరిగింది. పార్వతిపూర్ నయాఖేడా రైతు. కుంజ్ బిహారి శ్రమ ఈ సమావేశానికి మాకు సహాయం చేసారు.

అక్కడినుండి మా ఈ యాత్ర రధం ఉత్తర్ ప్రదేశ్లోని చిరగన్, చేరుకుంది. ఆ ప్రాంతంలోని రైతులు ఎటువంటి పంటలు పండిస్తారో మరియు ఎటువంటి పద్ధతుల్లో సేద్యం చేస్తున్నారో కనుక్కొని, వాళ్ళకి విలువైన సూచనలు మా వైజ్ఞానికులు అందచేసారు. అలాగే ఉత్తర్ ప్రదేశ్లోని లక్షాధికారి రైతుల గురించి వారికి తెలియపరిచారు. MFOI అవార్డులు పొందిన రైతులు, ఎటువంటి పద్దతులు అనుసరించి లక్షల్లో ఆదాయం పొందుతున్నారో వారికి వివరించారు. మనం చేసే వ్యవసాయంలో చిన్నచిన్న మార్పుల ద్వారా మంచి లాభాలు పొందవచ్చు అని వారికి సూచించారు. చిరగన్ లో సమావేశం నిర్వహించడంలో అక్కడి ఫార్మ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజషన్ సహాయం అందించింది.

Share your comments

Subscribe Magazine