News

పట్టణ ప్రాంతాలలో నోటరీ ప్లాట్ ల రెగ్యులరైజేషన్ షురూ ..

Srikanth B
Srikanth B
పట్టణ ప్రాంతాలలో నోటరీ ప్లాట్ రెగ్యులరైజేషన్ షురూ ..
పట్టణ ప్రాంతాలలో నోటరీ ప్లాట్ రెగ్యులరైజేషన్ షురూ ..

తెలంగాణ రాష్ట్రము లోని చాల పట్టణ ప్రాంతాలలో భూముల కొనుగోళ్ళు, ‘రిజిస్ట్రేషన్ కాని నోటరి’ ద్వార జరగడం వలన భూవివాదాలకు దారి తీస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గమనించి, ఇట్టి భూములను తగిన స్టాంప్ డ్యూటీ చెల్లించి క్రమభద్దికరణ చేసుకునుటకు ప్రజలకు అవకాశం కలిపిస్తూ G.O.No.84, తేది 26.07.2023 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.

దీని ప్రకారం సంబందిత ధరఖాస్తులు తమ దగ్గరలోని మీ-సేవ ద్వార సమర్పించవలసి ఉంటుందని…ధరఖాస్తుతో పాటుగా ధరఖాస్తుదారు భూమికి సంబంధించిన నోటరి పత్రము, లింక్ డాక్యుమెంట్, ఆస్థిపన్నురశీదు, విద్యుత్ బిల్లు, నీటి పన్ను ఏదైనా సంబందిత డాక్యుమెంట్ జతచేయవలసి ఉంటుందని వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఒక ప్రకటన లో తెలిపారు125 గజాల లోపు లేదా 125 గజాలలో నిర్మించినటువంటి కట్టడాలకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఉంటుందన్నారు.

రైతులకు శుభవార్త : నేటినుంచి లక్ష రుణమాఫీ

125 గజాల నుండి గరిష్టంగా 3000 గజాలకు సంబంధించిన డాక్యుమెంట్ లపై ప్రస్తుతం అమలులోఉన్న స్టాంప్ డ్యూటీ తో పాటు అదనంగా 5 రూపాయలు అపరాధ రుసుము చెల్లించవలసి ఉంటుందన్నారు

కావున సంబందిత దరఖాస్తులు తేది:01.08.2023 నుండి 3 నెలల లోపు మీ దగ్గరలోని మీ-సేవ కేంద్రాల ద్వార సమర్పించవలసినదిగా కోరుతూ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కలెక్టర్ ప్రజలకు తెలిపారు.

రైతులకు శుభవార్త : నేటినుంచి లక్ష రుణమాఫీ

Share your comments

Subscribe Magazine