News

ఇప్పుడు మామిడి పండ్లను EMIలో కూడా పొందవచ్చు, ఈ కొత్త ఆఫర్ గురించి తెలుసుకోండి..

Gokavarapu siva
Gokavarapu siva

మామిడి పండ్ల సీసన్ వచ్చేసింది. మామిడి పండ్లను ఇష్ట పడనివారు అంటూ ఉండరు. కానీ ఈ కరోనా తరువాత ప్రజలు ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానితోపాటు మామిడి పండ్ల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా మహారాష్ట్రకు చెందిన ఒక వ్యాపారు ఒక వినూత్న ఆలోచనతో వచ్చాడు. అతను మామిడి పండ్లకు కూడా ఈఎంఐ పద్ధతిని తీసుకువచ్చాడు.

ఇప్పటి వరకు మనం టీవీలు, ఏసీలు, ఫోన్లు మరియు ఏవైనా ఎలక్ట్రిక్ వస్తువులను వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఈ మామిడి పండ్లను కూడా కొనుకోవచ్చు. ఎలా అని ఆశ్చర్యపోకండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మామిడి పండ్ల రకాల గురించి చెప్పుకుంటే అత్యంత ఖరీదైన మామిడి పండ్లలో ఆల్ఫోన్సో కూడా ఒకటి. ఈ మామిడి చాలా వరకు పశ్చిమ భారతదేశంలోని కొంకణ్ ప్రాంతంలో కనిపిస్తుంది.

ముఖ్యంగా గుజరాత్ మరియు మహారాష్ట్ర ప్రాంతాలు దీనికి ప్రముఖమైనవి. మామిడి సీసన్ ప్రారంభమైతే చాలు, వవీటి ధరలు భారీగా పెరిగిపోతాయి. రిటైల్‌ మార్కెట్‌లో వీటి ధర డజన్‌కు రూ.800 నుంచి రూ.1300 వరకు ఉంటుంది. ఈ రకం మామిడి పండ్లను కొనుగోలు చేయాలంటే ప్రజలకు భారంగా మారింది. దీంతో పుణెకు చెందిన గౌరవ్‌ సనాస్‌ వినూత్న ఆలోచన చేశారు.

ఇది కూడా చదవండి.. 

మహిళలకు శుభవార్త: ఈ నెల 12న వారి ఖాతాల్లోకి రూ.15 వేలు..

ఇప్పుడు మనం జ్యుసి మామిడి పండ్లను EMI లో కొనుగోలు చేయడం ద్వారా కూడా ఆనందించవచ్చు . ప్రస్తుతం ఈ పథకం కేవలం అల్ఫోన్సో మామిడిపండ్ల కోసమే ప్రారంభించబడింది. వేసవి కాలం మనందరికీ ఆహ్లాదకరంగా ఉండేలా మామిడి పండ్లను మనం ఎప్పటికీ మర్చిపోలేము. చాలా మంది చిన్న దుకాణదారులు లేదా వ్యాపారులు మామిడి పండ్లను విక్రయించడం చాలా సులభం అయిన తరుణంలో, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వ్యాపారులు / దుకాణదారులు దానిని కొనలేరు మరియు విక్రయించలేరు. దీంతో సకాలంలో రావాల్సిన లాభాన్ని అందుకోలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ పథకాన్ని పూణేకు చెందిన ఒక వ్యాపారవేత్త, గురుకృపా ట్రేడర్స్ అండ్ ఫ్రూట్ ప్రొడక్ట్స్ ప్రారంభించారు.

ఈఎంఐ పద్ధతిలో తమ దుకాణాల్లో మామిడి పండ్లను కొనుకోవచ్చని గౌరవ్‌ సనాస్‌ తెలిపారు. కానీ ఈ వాయిదాల పద్దతిలో మామిడి పండ్లను పొందాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. ఈ ఆఫర్ అనేది కేవలం డెబిట్, క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈఎంఐ పధ్ధతి పొందాలంటే వినియోగదారుడు కనీసం రూ.5000 విలువైన మామిడి పండ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకుంటే బిల్లును మూడు, ఆరు, 12 నెలవారీ వాయిదాల్లో చెల్లించొచ్చని ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి..

మహిళలకు శుభవార్త: ఈ నెల 12న వారి ఖాతాల్లోకి రూ.15 వేలు..

Related Topics

alphonso mangoes emi

Share your comments

Subscribe Magazine