News

మినీ బ్యాంకులుగా రేషన్‌ షాపులు.. డబ్బులు ఇక్కడ డ్రా చేసుకోవచ్చు ..

Srikanth B
Srikanth B

రేషన్‌ షాపుల ద్వారా బ్యాంకింగ్ సేవలను అందించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది , గ్రామీణ ప్రజలు బ్యాంకింగ్ సేవలకు దూర ప్రాంతాలకు వెళాల్సిన దుస్థితి , కేవలం డబ్బులు డ్రా చేసుకోవడానికి తంటాలు పాడుకుంటూ దూరప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థి అందుకు ప్రభుత్వం తపాలా శాఖ ఐపీపీబీ (ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకు) రేషన్‌ దుకాణాల ద్వారా పౌర సేవలు అందించాలని భావిస్తుంది .

ఇందుకోసం ఆసక్తి కలిగిన డీలర్లను బ్యాంకు ప్రతినిధులుగా నియమించుకోనుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా మండలాల వారీగా డీలర్లకు అవగాహన తరగతులు నిర్వహించనున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో నేరుగా బ్యాంకు సేవలు పొందడానికి అవకాశం కలగనుండగా నగదు లావాదేవీలు, వివిధ రకాల బిల్లుల చెల్లింపులు సులువుగా నిర్వహించుకునే వీలుంటుంది. జిల్లాలోని డీలర్లందరికి అవగాహన కల్పించిన తదుపరి దరఖాస్తులు స్వీకరించనున్నారు.


ఇప్పటికే మినీ గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా మినీ బ్యాంకు తరహాలో సేవలందించేందుకు చర్యలు తీసుకుంటోంది. తపాలా శాఖ ఐపీపీబీ (ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకు) రేషన్‌ దుకాణాల ద్వారా పౌర సేవలు విస్తరించనుంది.

ఏపీ రేషన్ కార్డు దారులకు ఉచితంగా రాగులు ,జొన్నలు..ఏప్రిల్‌ నుంచే అమలు!


ప్రయోగాత్మకంగా కరీంనగర్ లో
జిల్లావ్యాప్తంగా 487 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. ప్రస్తుతం 441 మంది డీలర్లు పని చేస్తున్నారు. తపాలాశాఖ ఐపీపీబీ సేవలు విస్తరించే క్రమంలో వీరిని బ్యాంకు మిత్రలుగా నియమించుకునే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్‌ వాడకంపై అవగాహన ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అవగాహన కార్యక్రమాలు త్వరలో నిర్వహిస్తామని తపాలా, పౌరసరఫరాల శాఖల అధికారులు వెల్లడించారు .

ఏపీ రేషన్ కార్డు దారులకు ఉచితంగా రాగులు ,జొన్నలు..ఏప్రిల్‌ నుంచే అమలు!

Related Topics

Free ration

Share your comments

Subscribe Magazine