News

భారీగా మలక్‌పేట మార్కెట్‌కు తరలివచ్చిన ఉల్లిగడ్డ..

Gokavarapu siva
Gokavarapu siva

సోమవారం ఉదయం సందడిగా ఉండే మలక్‌పేట మార్కెట్‌కు ఉల్లిగడ్డలు భారీగా తరలివచ్చాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు మహారాష్ట్రతో సహా వివిధ రాష్ట్రాల నుండి 212 లారీలలో 28,890 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు మార్కెట్‌లో దిగుమతి అయ్యాయి. దీనితో మార్కెట్‌ యార్డులు నిండిపోగా, రహదారులపై పెద్ద ఎత్తున కుప్పలుగా పోసి విక్రయాలు నిర్వహించారు. దాంతో మార్కెట్‌లో ఎటు చూసినా ఎర్ర బంగారం కుప్పలే దర్శనమిచ్చాయి.

ఉల్లి ఎగుమతులు నిలిచిపోవడం, మహారాష్ట్రలో పంటలు గణనీయంగా దెబ్బతినడంతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల నుంచి రైతులు మలక్‌పేట మార్కెట్‌కు తరలివచ్చారు. మహబూబ్‌ మాన్షన్‌ మార్కెట్‌లో ఉల్లి ధరలు అనుకూలంగా ఉండకపోవడంతో రైతులు భారీగా తరలివచ్చారు.

మహారాష్ట్ర నుంచి 83 లారీలు, కర్ణాటక నుంచి 54 లారీల్లో 18,495 క్వింటాళ్లు, మహబూబ్‌నగర్‌ నుంచి 59 లారీల్లో 7,965 క్వింటాళ్లు, కర్నూల్‌ నుంచి 14 లారీల్లో 1890 క్వింటాళ్లు, నాఫేడ్‌ ద్వారా 540 క్వింటాళ్లు.. మొత్తం 28,890 క్వింటాళ్ల ఉల్లిగడ్డ మార్కెట్‌కు దిగుమతి అయింది.

ఇది కూడా చదవండి..

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆరోగ్య శ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంపు

మాహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మేలురకం(గ్రేడ్‌-1) ఉల్లిగడ్డ క్వింటాలకు గరిష్ఠంగా రూ.4 వేలు ధర పలుకగా, మధ్యరకం (గ్రేడ్‌-2) క్వింటాలుకు రూ.3,500, నాసి రకం క్వింటాలకు రూ.1,000 ధర పలికింది. మహబూబ్‌నగర్‌ గ్రేడ్‌-1 రకం ఉల్లిగడ్డ క్వింటాలుకు రూ.2,500, గ్రేడ్‌-2 రూ.2,200, నాసిరకం రూ.800, కర్నూలు ఉల్లిగడ్డ మేలు రకం రూ.2,400, మధ్యరకం రూ.2,000, నాసిరకం రూ.800లు పలికాయి.

ఇది కూడా చదవండి..

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆరోగ్య శ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంపు

Related Topics

onion malakpet market

Share your comments

Subscribe Magazine