News

భారతదేశంలో 'కాయిన్ వెండింగ్ మెషీన్ల'ను ప్రవేశపెట్టనున్న RBI...

KJ Staff
KJ Staff

మన భారతదేశ ఆర్ధిక వ్యవస్థలో పెద్ద నోట్లు ఎక్కువగా చలామణిలో ఉన్నపటికీ నాణేలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. చిల్లర డబ్బుల అవసరం అనేది ఎక్కువగా దుకాణాలు నిర్వహించేవారికి అవసరం ఉంటుంది. ఆర్బీఐ అలాంటివారి అవసరాలను గమనించి కీలక ప్రకటన చేసింది. ఆర్బీఐ గవెర్నెర్ అయిన శక్తికాంత్ దాస్ త్వరలోనే క్యూఆర్ కోడ్ ఆధారిత నాణేల విక్రయ యంత్రాలు (కాయిన్ వెండింగ్ మషిన్స్) అందుబాటులోకి తీసుకురానునట్లు ప్రకటించారు. ఈ యంత్రాల ద్వారా వ్యాపారాలు చేస్కునే వారికీ చిల్లర ఇబ్బంది తగ్గుతుంది.

మొదట భారతదేశంలో 12 నగరాల్లో వీటిని స్థాపించనున్నట్లు తెలిపారు. ఈ యంత్రాల ద్వారా నాణేల లభ్యత మరియు నాణేల వినియోగం మరింత సులభం అవుతుందన్నారు. కాగా ఈ నాణేల విక్రయ యంత్రాలు ఆటోమాటిక్ గా పని చేస్తాయన్నారు. ఈ మెషీన్లు బ్యాంక్ నోట్లకు బదులు నాణేలను పంపిణి చేస్తాయి. ఈ నాణేల విక్రయ యంత్రాలు ద్వారా భౌతిక నోట్లతో అవసరం ఉండదు అని చెప్పారు.

తద్వారా భౌతిక నోట్లతో అవసరం లేని విధంగా కస్టమర్ యూపీఐ (UPI) క్యూఆర్ కోడ్ తో స్కాన్ చేసి నాణేలను పొందవచ్చు. వినియోగదారుల ఖాతాలోని డబ్బు ఆటోమాటిక్ గా కట్ అవ్వి, నాణేలను ఇస్తుందని శక్తికాంత్ దాస్ వెల్లడించారు. అయితే పైలెట్ ప్రాజెక్ట్ ఆధారంగా బ్యాంకులకు మార్గదర్శకాలను జారీ చేసి, మెషిన్ల ద్వారా నాణేల పంపిణీని ప్రోమోట్ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి..

డిజిటల్ ఇండియా

ఈ క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషీన్ను (QCVM)కొన్ని టాప్ బ్యాంకుల సహాయముతో అభివృద్ధి చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ క్యూసివిఎమ్ లో క్యాష్ ఉండదు, కేవలం ఇది కాయన్లు మాత్రమే అందిస్తుందని తెలిపారు. ఖాతాదారుడు యూపీఐ ( యునిఫైడ్ పెమెంట్స్ ఇంటర్ఫెస్ ) ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కాయన్లను పొందవచ్చు. ఫలితంగా ఖాతాదారుడి అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. ఇందులో బ్యాంక్ నోట్ల అవసరం ఉండదు. కస్టమర్లు తమకు కావాల్సిన మొత్తంలో కాయిన్లను ఉపసంహరించుకోవచ్చు. ట్రయల్ ప్రాజెక్ట్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 12 నగరాల్లోని 19 లోకేషన్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, మార్కెట్లు వంటి జనసందోహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్‌ను బట్టి వినియోగాన్ని క్రమంగా పెంచనున్నారు.

ఇది కూడా చదవండి..

డిజిటల్ ఇండియా

Related Topics

rbi coin vending machines

Share your comments

Subscribe Magazine