News

Telangana: రైతులకు గుడ్ న్యూస్...... జూన్ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోళ్లు.....

KJ Staff
KJ Staff

రబి పంట కాలం పూర్తికావొస్తుంది, వరి పొలాలు అన్ని కోతలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఒక చల్లటి కబురును అందించింది. జూన్ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోళ్లు జరగనున్నట్లు తెలియజేసింది. రబి సీసన్ పూర్తవుతుండగా, ఈ మూడు నెలల్లో ధాన్యం కొనుగోళ్లు జోరుగా ఉండబోతున్నట్లు భావిస్తున్నారు. ఈ రబి సీజన్లో దాదాపు 75.40 లక్షల టన్నుల ధాన్యం కొనుగలో చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది, దీనికి సంభందించిన కార్యాచరణను తెలంగాణ పౌరసరఫరా శాఖ తయారుచేసింది.

రానున్న నెలల్లో, ప్రతీ జిల్లాలో కొనుగోలు చెయ్యవలసిన ధాన్యం మొత్తని అంచనా వేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి అవకతవకలకు వీలు లేకుండా, ఈ ప్రక్రియ మొత్తం సజావుగా జరిగేందుకు, ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభించింది, ప్రతి రోజు పెద్ద ఎత్తున ధాన్యం వచ్చి పడుతున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 7,149 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది, అయితే ఈ సోమవారం నాటికి 5,923 కేంద్రాలు ప్రారంభించారు, మిగిలిన కేంద్రాలు ఈ నెలాఖరు లోపు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్ధం కాగా, వరి కోత ముమ్మరంగా కొనసాగుతుంది. అన్ని జిల్లాలోనూ రైతులు వరి కోతలకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే నల్గొండ, నిజామాబాద్ జిల్లాలో కోతలు మొదలయ్యి, ఆఖరు దశకు చేరుకున్నాయి. రెండు మూడు వారాల్లో మిగిలిన అన్ని జిల్లాలో కోతలు మొదలయ్యే అవకాశం ఉంది.

వరి సాగు అధికంగా ఉన్నందున, మే నెలలో ధాన్యం పెద్ద ఎత్తున కేంద్రాలకు రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం ధాన్యం కొనుగోలులో 57% ఒక్క మే నెలలో జరగనున్నట్లు అంచనా. ఈ మేరకు జిల్లాల అదనపు కలెక్టర్లు, పౌరసరఫరా జిల్లా అధికారులు, సమీక్షా నిర్వహించనున్నారు. మిగిలిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ నెలలో, 19,20,846 టన్నుల ధాన్యం టార్గెట్గా కొనుగోలు చెయ్యాలని పౌరసరఫరా సంస్థ నిర్ణయించుకుంది. అదేవిధంగా మే నెలలో 43 లక్షల టన్నులు, మరియు జూన్ నెలలో దాదాపు 13.5 లక్షల టన్నులు కొనుగోలు చేసేందుకు, ప్రయత్నం చేస్తున్నారు.

Share your comments

Subscribe Magazine