News

దేశంలో పత్తి ధరల పెరుగుదల, ఖాదీ సంస్థలకి ఊరటగా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమీషన్ (KVIC)

S Vinay
S Vinay

ముడి పత్తికి విపరీతమైన ధర పెరగడంతో మొత్తం వస్త్ర పరిశ్రమ అతలాకుతలం అవుతోంది.మార్కెట్ లో ఏర్పడే దరల హెచ్చు తగ్గులకి మరియు ఇతర పరిణామాలను ఎదుర్కోవడానికి 2018 సంవత్సరంలో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమీషన్ (KVIC) దూర దృష్టితో ఆలోచించి ప్రత్యేక రిజర్వ్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఖాదీ సంస్థలకు ఆసరాగా నిలిచింది.

మార్కెట్లో ఏర్పడే అసమతుల్యత సంఘటనలను ఎదుర్కోవడానికి. 2018లో, KVIC తన 5 సెంట్రల్ స్లివర్ ప్లాంట్‌ల (CSPలు) కోసం ఉత్పత్తుల ధర సర్దుబాటు ఖాతా (PPA)ని సృష్టించాలని నిర్ణయించింది.కొన్ని నెలల క్రితం మొత్తం టెక్స్‌టైల్ రంగం షార్ట్-సప్లయ్ మరియు ముడి పత్తి ధరలో విపరీతమైన పెరుగుదలను ఎదుర్కొంటున్నప్పుడు, పత్తి ధరలు 110 శాతానికి పైగా పెరిగినప్పటికీ KVIC ఖాదీ సంస్థలకు సరఫరా చేసే రోవింగ్ ధరను పెంచకూడదని నిర్ణయించుకుంది. దీని వలన ముడి పత్తి బేళ్ల సేకరణపై రూ. 4.06 కోట్ల అదనపు వ్యయాన్ని KVIC భరించింది .KVIC తీసుకున్న ఈ సంచలనాత్మక నిర్ణయం, కోవిడ్ సమయంలో విధించిన ఆంక్షల కారణంగా ఇప్పటికే ఉత్పత్తి & మార్కెటింగ్ సవాళ్లతో సతమతమవుతున్న 2700 పైగా నమోదిత ఖాదీ సంస్థలు మరియు 8000 పైగా ఖాదీ ఇండియా అవుట్‌లెట్‌లకు పెద్ద ఉపశమనం కలిగించింది.దేశంలోని ఖాదీ సంస్థలు ధరల పెరుగుదలకు గురికాకుండా మరియు ఖాదీ కాటన్ దుస్తుల ధరలు కూడా పెరగకుండా ఉండేందుకు  KVIC రిజర్వ్ ఫండ్ నియంత్రిస్తుంది.

ఈ నిర్ణయం ఖాదీ సంస్థలతో పాటు ఖాదీ కొనుగోలుదారులను ధరల పెరుగుదల ప్రతికూల ప్రభావం నుండి కాపాడుతుంది కాటన్ కార్పొరేషన్ అఫ్ ఇండియా నుండి ముడి పత్తి కొరత ఫలితంగా పత్తి ధర పెరుగుదల ఖాదీతో సహా మొత్తం వస్త్ర పరిశ్రమను దెబ్బతీసింది. కానీ KVIC ఖాదీ సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి పాత ధరలకే రోవింగ్/స్లివర్ సరఫరాను కొనసాగించాలని నిర్ణయించింది. అదే సమయంలో, ఖాదీ వస్త్రాలు ధరలలో పెరుగుదల లేనందున ఇది కోట్లాది ఖాదీ కొనుగోలుదారులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.ఖాదీ భారతీయ వస్త్ర పరిశ్రమలో దాదాపు 9 శాతం వాటాను కలిగి ఉంది మరియు సంవత్సరానికి దాదాపు 150 మిలియన్ Sq Mtr ఫాబ్రిక్‌ను ఉత్పత్తి చేస్తుంది. పత్తి ధరలు విపరీతంగా పెరగడం వల్ల ప్రభావితం కాని ఏకైక సంస్థగా ఖాదీ అవతరించింది.
ఖాదీ సంస్థలు ఈ చర్యను ఏకగ్రీవంగా స్వాగతించాయి. పత్తి ధరల పెరుగుదల ఖాదీ ఉత్పత్తి మరియు చేతివృత్తులవారి వేతనాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ముడి సరుకుల ధర పెరిగితే, సహజంగా ఉత్పత్తి తగ్గుతుంది మరియు చేతివృత్తుల వారికి ఇచ్చే వేతనాలు కూడా తగ్గుతాయి. ఇలాంటి ప్రతికూలతల నుండి KVIC ఉపశమనం కలిగిస్తుంది.

ఇంక చదవండి

గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశానికై దరఖాస్తుల ఆహ్వానం, చివరి తేదీ మార్చ్ 28

Share your comments

Subscribe Magazine