News

రోబో లాయర్ ... ఎక్కడో తెలుసా ?

Srikanth B
Srikanth B
lawyer Robot
lawyer Robot

ఒకవైపు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ మరోవైపు రోబో ఇవి రెండు రానున్న రోజులలో మనిషి జీవితాన్ని మార్చేసే అంశాలు , ఒకవైపు ప్రయోజనాలు ఉన్న మరోవైపు వీటి వినియాగం పై ఆందోళనలు కూడా ఉన్నాయి . ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో లాయర్‌ను అమెరికాకు చెందిన 'డునాట్‌పే' సంస్థ అభివృద్ధి చేసింది. మనిషి పక్షాన ఇది కోర్టులో కేసు వాదించనుంది.

రోబోల వినియోగంతో ప్రజలకు పని లేకుండా పోతుందని పెద్ద మొత్తం లో ఉపాధిని కోల్పోతారనేది ఆందోళన కల్గించే అంశం అయితే శాస్త్రవేత్తలు మాత్రం దీనికి భిన్నంగా రోబోల రాక తో ఉపాధి పెరుగుతుందని వీటిని తాయారు చేసే సంస్థలలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు . ఏది ఏమైనప్పటికి మనిషిని పోలిన రోబోల సృష్టి దిశగా ప్రయోగాలు అయితే సాగుతున్నాయి . అదే క్రమంలో అభివృద్ధి చేసిన రోబో కోర్టులో వాదించబోతుంది.

 

ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో లాయర్‌ను అమెరికాకు చెందిన 'డునాట్‌పే' సంస్థ అభివృద్ధి చేసింది. మనిషి పక్షాన ఇది కోర్టులో కేసు వాదించనుంది. లాయర్లకు ప్రత్యామ్నాయంగా కృత్రిమ మేధ ఆధారంగా ఒక బోట్‌ను ఈ సంస్థ రూపొందించింది. వచ్చే నెల అమెరికాలోని ఓ కోర్టులో ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ఇది వాదనలు వినిపించబోతున్నది.

లంచం తీసుకున్న డబ్బులపై పింక్ కలర్ బాటిల్ ఎందుకు పెడతారో తెలుసా ?

అయితే, ప్రత్యక్షంగా ఎలాంటి రోబో ఉండదు. కోర్టుకు హాజరుకాదు. కోర్టుకు హాజరయ్యే ప్రతివాది తన సెల్‌ఫోన్‌లో ఈ యాప్‌ వేసుకోవడంతో పాటు, ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకోవాలి. కోర్టులో వాదనలను ఈ ఏఐ బోట్‌ విని ఎలా వాదించాలి, ఏ పాయింట్‌ను లేవనెత్తాలి వంటి సూచనలను కోర్టులో ఉన్న ప్రతివాదికి ఎప్పటికప్పుడు అందిస్తుంది.అయితే ప్రతిష్టాత్మకం గ చేపట్టిన ఈ ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో అని శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారు .

లంచం తీసుకున్న డబ్బులపై పింక్ కలర్ బాటిల్ ఎందుకు పెడతారో తెలుసా ?

Share your comments

Subscribe Magazine