News

రుటీన్ ఫర్ రాడిష్ కార్యాక్రమం ప్రత్యేకతలు......

KJ Staff
KJ Staff

రైతులు సాధారణంగా ఒక పంటను ప్రారంభించే ముందు, మార్కెట్లో ఆ పంటకు ఉన్న డిమాండ్ బట్టి, ఆ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితుల బట్టి తమ పంటను ఎంచుకుంటారు. గ్రామీణ ప్రాంతంలో రైతులు తమ చుట్టుపక్కల పొలాల వారు ఈ పంట వేస్తే అదే పంటను తమ పొలంలో సాగు చెయ్యడానికి మొగ్గుచూపుతారు. అందరూ ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే తాము కూడా వాటినే అనుసరించవచ్చన ఒక భరోసా దీనికి ప్రధాన కారణం.

చాల సంవత్సరాల నుండి అనుభవం ఉన్న కారణంగా, మన తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, ధాన్యం ఎక్కువుగా సాగు చెయ్యడానికి ఇష్టపడతారు. అయితే రైతులంతా ఒకే రకం పంటను సాగు చేయడం ద్వారా పంటా వైవిధ్యం తగ్గపోతూ వస్తుంది. ఇది ఆహార భద్రతపై తీవ్ర ప్రాభవం చూపుతుంది. ఆహార భద్రతను పెంచడానికి రైతులు వివిధ పంటలు సాగు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ధాన్యం, పప్పు దినుసులతో పాటు, పండ్లు, కూరగాయల పంటల మీద కూడా రైతులు ద్రుష్టి సారించాలి. కూరగాయల మార్కెట్లో విరివిగా లభించే రకాలతో పాటు, లభ్యత తక్కువ ఉన్న కూరగాయల సాగు చేప్పట్టడం ఉత్తమం. వాటిలో ప్రధానమైనది, ముల్లంగి.

ముల్లంగిలో అధిక పోషక విలువలు ఉన్న, అటు రైతులు ఇతి వినియోగదారులు, సాగుకు, వినియోగానికి మొగ్గుచూపట్లేదు. ఇలా తక్కువ ప్రధాన్యత ఉన్న కూరగాయలకు, ప్రాధాన్యత కల్పించి, వాటి ఉత్పత్తి పెంచే దిశగా కృషి జాగరణ్ పనిచేస్తుంది. కృషి జాగరణ్ వ్యవస్థాపకులు ఎం.సి. డొమినిక్ గారికి వచ్చిన ఈ ఆలోచన ద్వారా ప్రస్తుతం ముల్లంగి సాగును పెంచే విధంగా కృషి జాగరణ్ పనిచేస్తుంది. ముల్లంగి ఆరోగ్య విలువలను, ప్రజలకు తెలియపరచడానికి ఆర్టికల్స్ మరియు వీడియోల రూపంలో ప్రజలకు అవగాహనా కలిగిస్తుంది.


ముల్లంగి పై అవగాహన పెంచడానికి కృషి జాగరణ్ మార్చ్ 5 అంటే ఈ రోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహిస్తుంది. 'రుటీన్ ఫర్ రాడిష్ ' అనే ఈ కార్యక్రమానికి వివిధ సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారు. ముల్లంగి సాగు గురించి, దానియొక్క ఉపయోగాల గురించి ఈ కార్యక్రమంలో చర్చించడం జరుగుతుంది. సోమాని సీడ్స్ సహకారంతో ఈ క్రయక్రమం నిర్వహించడం జరుగుతుంది.

Somani Seeds:

సోమాని సీడ్స్ కాయగూరల విత్తనాలను అభివృద్ధిచేయడంలో ఎన్నో ఏళ్ల అనుభవం కలిగి ఉంది. అన్ని వాతావరణ పరిస్థితులకు, అనుగుణంగా, హైబ్రిడ్ కూరగాయలు మరియు ఆకుకూరలు సోమాని సీడ్స్ అభివృద్ధి చేస్తుంది. నాణ్యమైన మరియు అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాలు రైతులకు అందిస్తూ, వారి వ్యవసాయ లాభాల్లో సోమాని సీడ్స్ కీలక పాత్ర పోషిస్తుంది. ముల్లగికి ప్రాముఖ్యత కలిగించాలన్న ఎం.సి. డొమినిక్ లక్ష్యం మేరకు, సోమాని సీడ్స్ తో ముడిపడి ఈ లక్ష్య సాధనకు కలసికట్టుగా కృషి చెయ్యడం జరుగుతుంది. సోమాని సీడ్స్ ముల్లంగిలో ఎన్నో హైబ్రిడ్ వెరైటీలను తయారు చేసింది . 'Hy Radish X-35' అనే రకం ప్రస్తుతం అధిక డిమాండ్ కలిగి ఉంది. ఈ రకం కేవలం 35 రోజుల్లోనే పరిపక్వము చెంది, తక్కువ సమయంలోనే దిగుబడిని ఇస్తుంది. తెల్లని రంగు, 20-25 అంగుళాల పొడవు, ఎనిమిది సెంటీమీటర్ల వెడల్పుతో ఈ రకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఘాటు తక్కువుగా ఉండటం మూలాన వినియోగదారులు ఈ రకం ముల్లంగికి మొగ్గు చూపుతున్నారు, అంతేకాకుండా వేడిని కూడా తట్టుకుని ఈ రకం అధిక దిగుబడిని ఇవ్వగలదు.

కృషి జాగరణ్ ఈ రోజు నిర్వహించబోయే రుటిన్ ఫర్ రాడిష్ కార్యక్రమం ఎంతో ప్రత్యేకం ఎందుకంటే, ఇక నుండి ముల్లంగి పండించే రైతులను కూడా మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డులతో సత్కరించనున్నారు.

Share your comments

Subscribe Magazine