News

"రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, భూమి లేని రైతుకు రూ.15 వేలు"- టీపీసీసీ రేవంత్ రెడ్డి

Srikanth B
Srikanth B

తెలంగాణాలో ఇప్పుడే ఎన్నికల హడావిడి కనిపిస్తుంది ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉండగానే అన్ని పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి . తెలంగాలో కాంగ్రెస్ పార్టీని పదవిలోకి తీసుకురావడానికి  కాంగ్రెస్ టీపీసీసీ రేవంత్ రెడ్డి చేపట్టినా పాదయాత్రలో భాగం గ మాట్లాడుతూ రైతుల పై హామీల వర్షం కురిపించారు , పార్టీ అధికారంలో కి వస్తే రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. భూమి లేని రైతులకు రూ.15 వేలు, రూ.500 కే గ్యాస్ సిలిండర్, ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు .

అంతే కాకూండా రాష్ట్రంలో అన్ని వర్గాలకు సాయం అందిస్తామని , నిన్న పాదయాత్రలో భాగంగా రైతులతో కలిసి నాట్లు వేసిన రేవంత్ రెడ్డి వివరిస్తూ ఆ మట్టిలో కాలుమోపిన క్షణం నా మూలాలు గుర్తొచ్చాయి. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే కదా... నేను ఈ మట్టి మనుషుల బిడ్డనే. ఈ మట్టి వాసనల మధ్య పెరిగిన తెలంగాణ బిడ్డనే. నికార్సైన రైతు బిడ్డనే. రైతు కష్టం తెలిసినోడినే... జై కిసాన్" అంటూ ట్వీట్ చేశారు.

గోదావరి వరద బాధితులకు ఇళ్లు కట్టిస్తామని కల్పిత హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మోసం చేశారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. తన పర్యటనలో వరద బాధితులను పరామర్శించి తనవంతు సాయం అందించారు రేవంత్. కాగా రేవంత్ రెడ్డి పాదయాత్ర మంగళవారానికి 101 కిలోమీటర్లు పూర్తయింది. ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలో రేవంత్ రెడ్డి ప్రజాధారణ కనిపించింది. ఆయన సభలకు జనలు భారీగా తరలొచ్చారు.

ఏపీ రైతులపైన రుణభారం దేశంలో అత్యధికం .. కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడి!

రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతున్న క్రమంలో మరోవైపు భువనగిరి MP కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ పై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపాయి .

ఏపీ రైతులపైన రుణభారం దేశంలో అత్యధికం .. కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడి!

Related Topics

farmerloan

Share your comments

Subscribe Magazine