News

బ్యాంకుల విలీనంతో రైతుబంధు అందక రైతు కష్టాలు..

Srikanth B
Srikanth B

దేశంలో 2019 లో బ్యాంకుల విలీనం ప్రక్రియ జరిగిన విషయం తెలిసిందే దీనితో రైతులకు పెట్టుబడి సాయం గ అందించే రైతుబంధు పథకం ఖత లింక్ అయినా బ్యాంకు వివరాలు మెరుపు జరిగాయి దీనితో రైతుబంధు డబ్బులు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు , డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న ప్రయోజనం లేకుండా పోయింది .

పెట్టుబడి నిమిత్తం అన్నదాతలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఏటా రెండు పంట కాలాలకు రైతుబంధు కింద ఎకరాకు రూ.5 వేలు అందిస్తోంది.

బ్యాంకుల విలీనంతో ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ సమస్య తలెత్తింది. ఫలితంగా ప్రస్తుత యాసంగి సీజన్‌లో బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, తాడ్వాయి మండలాల్లోని పలువురు రైతుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. సర్కారు సాయం కోసం కర్షకులు రెండు నెలలుగా వ్యవసాయ, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోతోంది.

కేంద్ర ప్రభుత్వం గతేడాది పలు బ్యాంకులను విలీనం చేసిన విషయం తెలిసిందే. కార్పొరేషన్‌ బ్యాంకును యూనియన్‌ లో విలీనం చేయడంతో ఐఎఫ్‌ఎస్‌ కోడ్‌ మారింది. ఫలితంగా కార్పొరేషన్‌లో ఖాతాలున్న రైతులందరికి పెట్టుబడి సాయం జమ కాలేదు.

రైతులకు శుభవార్త : ఫిబ్రవరి 27 న రైతుభరోసా డబ్బులు ఖాతాలోకి ...


దీనికి ప్రభుత్వం తక్షణమే పరిష్కార మార్గం చూపాలని ,అదేవిదం గ సాంకేతిక కారణాలతో తలెత్తిన సమస్యలని తక్షణమే పరిష్కరించే రైతులకు రైతుబంధు డబ్బులు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు .

రైతులకు శుభవార్త : ఫిబ్రవరి 27 న రైతుభరోసా డబ్బులు ఖాతాలోకి ...

Related Topics

raithubandu telangana

Share your comments

Subscribe Magazine