News

హైదరాబాద్ లో పెరిగిన సీజనల్ వ్యాధులు.. !

Srikanth B
Srikanth B
హైదరాబాద్ లో పెరిగిన సీజనల్ వ్యాధులు.. !
హైదరాబాద్ లో పెరిగిన సీజనల్ వ్యాధులు.. !

మరీన వాతావరణం వారం రోజులు నిరంతరాయంగా కురిసిన వర్షంకారణంగా ఇటు తెలంగాణలో మరియు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఒక్కసారిగా సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్నాయి. మరీన వాతావరణంతో అధిక శాతం ప్రజలు జ్వరం తలనొప్పులతో ఆసుపత్రులకు క్యూలు కడుతున్నారు.

గతం వారం రోజులుగా కురిసిన వర్షాలతో నగరంలో వైరల్ ఫీవర్స్‌తో ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నారు. రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో నగరంలో ఒక్కసారిగా సీజనల్ వ్యాధులు పెరిగిపోయాయని అధికారులు చెబుతున్నారు. నగరంలోని ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆసుపత్రులకు రోగుల తాకిడి ఎక్కువైంది. ఒక్కో ఆసుపత్రికి 500 వరకు పెరిగిన ఓపీ సంఖ్యపెరిగింది. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. 10 రోజుల వ్యవధిలోనే జీహెచ్ఎంసీలో డెంగీ, మలేరియా కేసులు పెరగడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.

 

మరోవైపు భారీగా కురిసిన వర్షాల కారణంగా నగరంలో రోడ్లు అన్ని జలమయం అయయ్యాయి దీనితో రోజుల తరబడి నగరంలోని చాలా కాలనీలు నీళ్లలోనే ఉండిపోయాయి. భారీవర్షాలనుంచి ఇప్పుడే కోలుకుంటున్న ప్రజలకు పెరుగుతున్న సీజనల్ వ్యాధులు ప్రజలను ఆందోళన కల్గిస్తున్నాయి. వర్షాల కారణంగా దోమలు విపరీతంగా పెరిగిపోయి జ్వరం, జలుబు, దగ్గుతో పాటు టైఫాయిడ్, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధులు నగర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Related Topics

helath tips

Share your comments

Subscribe Magazine