News

ఈ నెల 15 నుంచి రెండో విడత గొర్రెల కొనుగోళ్లు .. పంపిణీకి కసరత్తు !

Srikanth B
Srikanth B
Sheep Distribution Scheme Telangana2023
Sheep Distribution Scheme Telangana2023

తెలంగాణాలో గొల్ల -కుర్మా సోదరుల జీవన ఉపాధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం గొర్రె ల పంపిణి పథకాన్ని ప్రారంభించింది అయితే 2017 లో మొదటి విడత లో భాగంగా 3,665,000 గొర్రెలను పంపిణి చేసింది , ఇప్పటికి ఈ పథకం క్రింద ప్రయోజనం పొందని రైతులు రెండో విడత కోసం ఎదురు చూస్తున్నారు .

నల్లగొండ జిల్లాలో రెండో విడత కింద 37,078 మంది దరఖాస్తు చేశారు. దీంట్లో 4,800 మం ది లబ్ధిదారులకు మునుగోడు ఉప ఎన్నికల సమయంలో గొర్రెలు పంపిణీ చేశారు.మిగిలిన 32,278 మంది లబ్ధిదారులకు గొర్రెలు పంపిణి చేయవలసి ఉంది . రెండో విడత కింద అప్లై చేసుకున్న లబ్ధిదారులను క్షేత్ర స్థాయిలో విచారించేందుకు సోమవారం నుంచి పశుసంవర్ధక శాఖ ఆఫీసర్లు గ్రామాల్లో పర్యటించనున్నారు.

రెండో విడత గొర్రెల పంపిణి, ధరఖాస్తుల స్వీకరణ పై అవగాహన!

2017-18లో పథకం ప్రారంభం నాటి గైడ్​లైన్స్​నే ఇప్పుడు పాటిస్తూ ఈ నెల 15 నుంచి గొర్రెల కొనుగోళ్ల కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని అధికారులను నిర్ణయించారు. ఇందులో భాగంగా నేటి నుంచి అన్ని గ్రామాల్లో వెటర్నరీ ఆఫీసర్లు ఇంటింటికీ తిరిగి లబ్ధిదారుల వివరాలు సేకరించనున్నారు. దరఖాస్తుదారుల్లో ఎందరు ఎవరైనా చనిపోతే నామినీ వివరాలు, ఆధార్​కార్డు, బ్యాంకు అకౌంట్లు సేకరిస్తారు. లబ్ధిదారుడు వాటా కింద చెల్లించాల్సిన రూ.43,750 డీడీ కట్టిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి య్యాక లబ్ధిదారుల వివరాలను ఆన్​లైన్​లో ఎంటర్​ చేస్తారు.

ఈ పథకం మొదటి విడత జూన్ 20, 2017 లో ప్రారంభమై, సుమారు 3,665,000 గొర్రెలను పంపిణి చేయడం జరిగింది .ఈ పథకానికి రిజిస్టర్ చేసుకోడానికి లబ్ధిదారుడు తెలంగాణ స్థానికుడు అయ్యుండాలి . కుర్మా లేదా యాదవ వర్గానికి చెంది ఉండి , 18 సంవత్సరాలకు పైబడి ఉండాలి.

రెండో విడత గొర్రెల పంపిణి, ధరఖాస్తుల స్వీకరణ పై అవగాహన!

Share your comments

Subscribe Magazine