News

సిక్కిం సీఎం సంచలన నిర్ణయం..పిల్లల్ని కంటే ఇంక్రిమెంట్, రూ.3లక్షల ఆర్థిక సాయం ..

Srikanth B
Srikanth B

ప్రపంచం లోనే అత్యధిక జనాభా కల్గిన దేశాలలో చైనా తరువాత రెండొవ స్థానము లో ఉంది భారతదేశం ఇప్పటికే కొందరు రాజకీయ నేతలు జనాభా నియంత్రణ పాలసీ తీసుకురావాలని డిమాండ్ చేస్తుంటే మరోవైపు సిక్కిం రాష్ట్రము పిల్లలు ఎక్కువ  కనే వారికీ శుభవార్త అందించింది .

దేశంలో ఎక్కువ మంది పిల్లల్ని కంటే అనేక ప్రోత్సహకాలు ఇస్తున్నట్లు సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. పిల్లలను కంటే ప్రభుత్వ ప్రోత్సాహకాల తోపాటు సంవత్సరం పాటు ప్రసూతీ సెలవులు, తండ్రికి కూడా సెలవులు ,ప్రభుత్వ ఉద్యోగులుకు పిల్లలు పుడితే జీతాలు కూడా పెంచుతారంట. ఇద్దరు పిల్లలకు ఒక ఇంక్రిమెంట్, ముగ్గురు పిల్లలకు డబుల్ ఇంక్రిమెంట్ ఇస్తామంటూ సంచలన ప్రకటన చేసింది .

మాఘే సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆదివారం సిక్కింలోని జోరెథాంగ్‌ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌.. సిక్కిం సంతానోత్పత్తి రేటు ఇటీవలి భారీగా తగ్గిందన్నారు. అత్యల్ప వృద్ధి రేటును నమోదు చేసిందని, సిక్కిం జాతి జనాభా క్షీణించిందన్నారు. గత ప్రభుత్వాలు ఒకే బిడ్డ నినాదంతో ముందుకెళ్లాయని..తద్వారా ఇప్పుడు రాష్ట్ర జనాభా 7 లక్షలుగా ఉందని, గత ప్రభుత్వాల నిర్ణయాల ఫలితమే నేడు రాష్ట్ర జనాభా క్షీణించిందని సీఎం తమాంగ్ అన్నారు. రాష్ట్ర జనాభాను పెంచే ఆవశ్యకత ఉందని, ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ప్రయత్నించాలని సూచించారు.

ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగినులు ఎక్కువ మంది పిల్లల్ని కంటారో వారికి ఎక్కువ ప్రోత్సాహకాలు అందుతాయని తెలిపారు. ఇద్దరు పిల్లల్ని కంటే ఒక ఇన్సెంటీవ్‌, ముగ్గురు పిల్లల్ని కన్నవారికి డబుల్‌ ఇక్రిమెంట్‌ తో పాటు ఎక్కువ సెలవులు తీసుకునేందుకు కూడా అనుమతిస్తామని కూడా చెప్పారు. ఒక బిడ్డ మాత్రమే ఉన్న మహిళకు ఈ ఆర్థిక ప్రయోజనం అందుబాటులోకి రాదని తమంగ్ స్పష్టం చేశారు ఇప్పటికే స్త్రీలకు 365 రోజుల ప్రసూతి సెలవులను అందజేస్తోందని తెలిపారు .


మహిళలు కృత్రిమమగా నైనా పిల్లలు కానవచ్చు , ఏవిధంగానైనా 1 కంటే ఎక్కువ పిల్లలు కల్గిన స్త్రీలకు అధిక సెలవులు , ఇంక్రెమెంట్లు ఇస్తామని రాష్ట్ర ముఖ్య మంత్రి స్వయంగా ప్రకటించారు . రాష్ట్ర అభివృద్ధిలో యువ జనాభా కీలకని అయన తెలిపారు .

Related Topics

sikkim

Share your comments

Subscribe Magazine