News

పత్తి తెల్ల బంగారమయేలే.....

KJ Staff
KJ Staff

అంతర్జాతీయ దిగుబడులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన కారణం చేత, చాల రకాల వయ్వసాయ ఉత్పత్తులకు డిమాండ్ భారీగా పెరిగింది. ఇప్పుడు ఈ జాబితాలో, పత్తి కూడా చేరింది. కొనుగోలు సీసన్ ఆరంభంలో అంతంతమాత్రం ఉన్న పత్తి ధర ఇప్పుడు కొండెక్కి కూర్చుంది. పెరిగిన ధరల ద్వారా పత్తిని ఎక్కువుగా పండించే కరీంనగర్, ఖమ్మం జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పత్తి సీజన్ కొనుగోలు ఆరంభంలో పత్తి ధర, కనీస మద్దత్తు ధరకంటే తక్కువ పలికింది. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు, కాటన్ కొర్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) పత్తిని కనీస మద్దతు ధరకు కొనడం పార్రంభం చేసింది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ అంతర్జాతీయ దిగుబడులపై విధించిన ఆంక్షలు మూలంగా, ప్రైవేట్ వ్యాపారుల చూపు స్వదేశీ పత్తి మీద పడింది. తద్వారా ప్రైవేట్ సంస్థలనుండి పత్తికి డిమాండ్ అధికంగా పెరిగింది.

 

ప్రస్తుతం క్విటాకు రూ. 7020 ఉండగా, ప్రైవేట్ సంస్థలు రూ. 7,750 వరకు చెల్లిస్తున్నాయి. 2021, కోవిడ్ సమయంలో క్వింటా రూ.14,000 వరకు చేరుకుంది. ఇది ఇలా ఉండగా భవిష్యత్తులో పత్తి ధర ఇంకా పెరగచ్చు అనే ఉదేశ్యంతో కొంతమంది రైతులు తమ ఇళ్లలోనే పత్తిని నిల్వ చేసుకుంటున్నారు. పత్తితో పాటు పత్తిగింజల గిరాకీ కూడా బాగా పెరిగింది. మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మరియు హర్యానా వంటి రాష్ట్రాలు పట్టి గింజలను ఎక్కువుగా కొనుగోలు చేస్తున్నాయి.

Share your comments

Subscribe Magazine