News

మార్చిలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం !

Srikanth B
Srikanth B

మార్చి నెల మెదలైన మొదటి వారానికే ఎండలు దంచి కొడుతున్నాయి , రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా కూడా భానుడు ప్రభావం చూపిస్తున్నాడు , మార్చిలో ఉష్ణోగ్ర తలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయం పడుతున్నారు , దేశంలోనే అత్యధిక అటవీ ని కల్గి వున్నా కేరళ రాష్ట్రంలోనే ఎండలు దంచి కొట్టడం దేశంలో ఎండలు పెరుతుననయడానికి నిదర్శనం.

మరోవైపు కేరళ వేడి గాలుల ప్రభావం రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడుపై కూడా ఉండే అవకాశం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే ఎండల తీవ్రత పెరుగుతోబంది. ఎండ వడదెబ్బ తగిలినప్పుడు శరీర ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతుంది. 40 డిగ్రీల సిల్సీయస్ అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత పెరుగుతుంది. పెరుగుతున్న వేడి తీవ్రతలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఎండలో బయటకు వెళ్లడం మానుకోవాలని సూచిస్తున్నారు. వీలైనంత తరచుగా తగినంత నీరు త్రాగాలి. శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటేడ్ శీతల పానీయాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు

కేరళ రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. తిరువనంతపురం, కొల్లం, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, కోజికోడ్, కన్నూర్‌లోని ప్రధాన ప్రాంతాలలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతాల్లో వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీలకు మించవు. ప్రజలు బయటికి వెళ్లేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలని, ఎండ నుంచి రక్షించుకోవడంతో పాటు ఎక్కువ నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మార్చి 31 తో ముగియనున్న పాన్-ఆధార్ కార్డ్ లింకింగ్ గడువు ..

గోవాలో గత రెండు రోజులుగా ఎండ వేడి పెరిగింది. వేసవిలో ఎండ 45 డిగ్రీలు దాటితేనే జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతారు. రాబోయే రోజుల్లో వేడి గాలులు మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో మార్చిలోనే 50 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడింది.

మార్చి 31 తో ముగియనున్న పాన్-ఆధార్ కార్డ్ లింకింగ్ గడువు ..

Related Topics

Temperatures

Share your comments

Subscribe Magazine