News

కనుమరుగవుతున్న గాడిద..

KJ Staff
KJ Staff

కాలం మారే కొద్దీ శ్రమకు, కష్టానికి చిహ్నంగా నిలిచినా గాడిద ఇప్పుడు కనబడకుండా పోతుంది. ప్రపంచం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుండగా మనిషి జీవన శైలిలో చాలా మార్పులు వచ్చి, గాడిదల సంఖ్య గమనీయంగా తగ్గిపోయింది. మరికొద్ది సంవత్సరాలు ఇదే పరిస్థితి భూమి మీద కొనసాగితే గాడిదుల జాతి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రత్యేక ద్రుష్టి పెట్టి, గాడిద సంతతిని పెంచడానికి వార్షిక ప్రణాలికను తయారుచేసినట్లు తెలుస్తుంది.

గాడిదలను ఎక్కువగా గ్రామాల్లో బరువులు మోయడానికి వాడతారు. గాడిద యొక్క జీవితకాలం వచ్చేసి 50 సంవత్సరాలు. గాడిదలను కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ పనుల్లో వినియోగిస్తారు. మరి కొంత మంది ఎక్కువగా కొండా ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఐతే రవాణాకు వాడతారు. చాకలి వారు ఐతే తమ వృత్తిలో భాగంగా బరువులు మోయడానికి వాడేవారు. ఈమధ్యకాలంలో రవాణా కొరకు అనేక సదుపాయాలు అనగా ఆటోలు, ద్విచక్ర వాహనాలు అందుబాటులోకి రావడంతో గాడిదల యొక్క వినియోగం మరియు వాటి సంఖ్య బాగా తగ్గిపోయింది. గాడిదల సంఖ్య 30 ఏళ్ల క్రిందట ఎక్కువగానే ఉండేది. గ్రామాల్లో ఎక్కడ చూసినా కనబడేవి. గాడిద పాలను కొన్ని ఆయుర్వేద మందుల్లో వాడేవారు. వీటి పాలు పిల్లలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గాడిద పాలను సేకరించి అమ్ముకుంటారు. ప్రస్తుతం గాడిద పాలకు డిమాండ్ ఉండటం వలన కొందరు గాడిదలను జీవనాధారంగా మలుచుకున్నారు.

ఇది కూడా చదవండి..

'సూపర్ కౌ'ని సృష్టించిన చైనా .. రోజుకి 140 లీటర్ల పాలు

2007 లెక్కల ప్రకారం అనంతపురం జిల్లాలో 15 వేలకు పైగా గాడిదలు ఉందేవి. ఆ సంఖ్య అనేది కాలక్రమేణా తగ్గుతూ 2012లో 6800కు,
మరియు 2018లో 3200కు తగ్గిపోయింది. ప్రస్తుతం ఐతే అక్కడ గాడిదల సంఖ్య 1000 లోపు ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో రొళ్ల, శెట్టూరు, విడపనకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు, యాడికి, పెద్దవడుగూరు, గుంతకల్లు, గుత్తి, ధర్మవరం, కూడేరు, కుందురో, అమరాపురం, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో గాడిదలు సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ నెల 23న అనంతపురంలో అంతరించిపోతున్న గాడిదల సంతతిని పెంచే విధంగా జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 'బ్రూక్ హాస్పిటల్' ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం, పశుసంవర్ధక శాఖ సహకారంతో 'డీక్లినింగ్ డాంకీ పాపులేషన్ అండ్ స్టెప్స్ ఫర్ మిటిగేషన్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్' అనే అంశంపై సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో కేంద్ర ప్రభుత్వం, హాస్పిటల్ ప్రతినిధులతో పాటు, నోడల్ ఆఫీసర్లు, అనిమల్ వెల్ఫేర్ ఆర్గనైసెషన్ ప్రతినిధులు, గుంటూరుకు చెందిన గాడిద పెంపకందారులు హాజరవుతున్నట్లు ఆ సఖ జిల్లా అధికారి డాక్టర్. వై. సుబ్రహ్మణ్యం తెలిపారు.

ఇది కూడా చదవండి..

'సూపర్ కౌ'ని సృష్టించిన చైనా .. రోజుకి 140 లీటర్ల పాలు

Related Topics

donkey donkey milk demand

Share your comments

Subscribe Magazine