News

ఆ గ్రామంలో ఇళ్ళకు,బ్యాంకులకు తలుపులు ఉండవు .. అయిన దొంగతనాలు జరగవు ఎందుకో తెలుసా !

Srikanth B
Srikanth B

 


నిత్యం మనం వార్తలలో దొంగతనాలు , నేరాలకు సంబందించిన వార్తలను అధికంగా చూస్తుంటాము , అయితే ఒక గ్రామంలో అసలు ఇంటికి తలుపులే వుండవు , కేవలం ఇళ్లకు మాత్రమే కాదు బ్యాంకులకు కూడా తలుపులు వుండవు అయినా ఇప్పటివరకు ఒక్క దొంగతనం కూడా జరుగలేదు ఇంతకీ ఆగ్రామం ఎక్కడుందో తెలుసా !

 

 

ఈ వింత గ్రామం మహారాష్ట్రలో ఉంది. ఈ గ్రామం పేరు శని శింగనాపూర్. ఈ గ్రామాన్ని శని దేవుడే కాపాడుతున్నాడని ఆ గ్రామ ప్రజల నమ్మకం. ఈ కారణంగా, ఈ గ్రామంలోని ఏ ఇంటికీ తలుపులు ఉండవు. అంతేకాదు.. ఇక్కడి దుకాణాలు, బ్యాంకులకు కూడా తలుపులు ఉండవు. శనిశింగనాపూర్ గ్రామస్తులకు శనిదేవునిపై అచంచలమైన భక్తి, విశ్వాసం ఉన్నాయి.

రానున్న 5 రోజులు AP, తెలంగాణాలో వర్షాలు !

శనిదేవుడు తమ కుటుంబాలను, తమ ఇళ్లను ఎల్లప్పుడూ రక్షిస్తాడని ప్రజల విశ్వాసం. ఈ నమ్మకం కారణంగానే నేటికీ గ్రామంలోని ప్రజలు తమ ఇళ్ల తలుపులకు తాళాలు వేయరు, దుకాణాలకు, బ్యాంకులకు కూడా తాళాలు వేయరు. వారు తాళాలు వేయకపోవడమే కాదు.. ఇంత వరకు అక్కడ ఒక్క చోరీ జరిగిన దాఖలాలు కూడా లేవు.

రానున్న 5 రోజులు AP, తెలంగాణాలో వర్షాలు !

Related Topics

viral news

Share your comments

Subscribe Magazine