News

ఆరోగ్య శ్రీ వైద్య సాయం రూ. 5 లక్షలకు పెంపు .. eKYC చేసుకున్న వారికే

Gokavarapu siva
Gokavarapu siva
ఆరోగ్య శ్రీ వైద్య సాయం రూ. 5 లక్షలకు పెంపు .. eKYC చేసుకున్నవారికే
ఆరోగ్య శ్రీ వైద్య సాయం రూ. 5 లక్షలకు పెంపు .. eKYC చేసుకున్నవారికే

తెలంగాణ రాష్ట్రంలోని దారిద్రరేఖకు దిగువ ఉన్న వారి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకంతో సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసినదే. అయితే ఆరోగ్యశ్రీ పథకం కింద 1672 వ్యాధులకు వైద్యం అందిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ లో కొంతమందిని మాత్రమే కవర్ చేశారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ లో కవర్ గాని ప్రజలను దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలందరికీ కార్పొరేట్ వైద్యం అందాలని  తేలంగాణ ప్రభుత్వం  ఆరోగ్యశ్రీ పథకం నిదులను  2 లక్షల నుంచి వెళ్లి 5 లక్షలకు పెంచారు.

ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చారు. ఇది ప్రజలు గమనించి ప్రతి ఒక్కరూ eKYC చేసుకొని ఈ పథకానికి అర్హులు కాగలరని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్  గారు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ గారి ఛాంబర్ లో ఆవిష్కరించడం జరిగింది.

ఆరోగ్య శ్రీ eKYC తప్పని సరి:

తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఆరోగ్యశ్రీ eKYC చేపించుకుంటేనే వారు 5 లక్షలకు అర్హులవుతారు. కావున ప్రతి ఒక్కరూ మీ దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా మీ సేవ సెంటర్ లలో ఉచితంగా ఈ కేవైసీ చేయించుకోగలరు. eKYC చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వబడును అని జిల్లా కలెక్టర్ గారు తెలిపారు.

జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ లో క్యాంప్ మోడల్ లో అరోగ్య శ్రీ ఈ కేవైసీ చేయడం జరుగుతుంది. దీని దృష్టిలో పెట్టుకొని జిల్లాలోని ప్రజలందరూ ఈ కేవైసీ చేసుకోగలరని సూచించారు. eKYC చేసుకోవడానికి తెల్ల రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఆధార్ కార్డుతో లింకు ఉన్న మొబైల్ నెంబర్ ను తీసుకెళ్లాలి. ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ లేనియెడల బయోమెట్రిక్ తో ఈ కేవైసీ చేయబడును. ఇదివరకు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయిన రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీలో రిజిస్ట్రేషన్ చేస్తే ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వస్తుంది దీనికి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ అటు ఆయుష్మాన్ భారత్ లో మరియు ఆరోగ్యశ్రీలో కొత్తగా డిజిటల్ కార్డులు ఇవ్వడం జరుగును.

Related Topics

Arogya Sri

Share your comments

Subscribe Magazine