News

యాసంగిలో వరికి బదులు పత్తి పంట సాగుకు ట్రయల్స్..

Gokavarapu siva
Gokavarapu siva

తెలంగాణ రాష్ట్రానికి చెందిన యాసంగిలో ఈ సీసన్, వ్యవసాయ శాఖ అధికారులు వరికి బదులు పత్తిని సాగు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ ట్రయల్స్ కొరకు వ్యవసాయ శాఖ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 165 ఎకరాల్లో ప్రయోగం చేసింది. ఇటీవలి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1.5 కోట్ల టన్నుల వరి దిగుబడి వస్తుందని అన్నారు. దీనివలన ధాన్యం కొనుగోళ్ల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ సమస్యలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వరి సాగు తగ్గించి, పత్తి సాగు పెంచాలని నిర్ణయం తీసుకుంది.

ముందుగా పత్తి సాగు చేయడం వలన వచ్చే సమస్యలను అంచనా వేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికొరకు వ్యవసాయ అధికారులు ఆయా జిల్లాలో ఉన్న విత్తనోత్పత్తి క్షేత్రాల్లో పత్తి పంటను పండిస్తున్నారు. యాసంగిలో పత్తి పంటను పండించడం వలన కలిగే సమస్యలను మరియు ఆ పంటకు వచ్చే దిగుబడుల గురించి తెలుసుకునేందుకు ఇక్కడ పతి సాగును చేస్తున్నారు.

అగ్రికల్చర్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం జనవరి నెల నుండి ఆయా జిల్లాలకు చెందిన విత్తన క్షేత్రాల్లో పత్తి సాగును ప్రారంభించారు. సుమారుగా యాంసంగిలో 200 ఎకరాల్లో ఈ పత్తి పంటను సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 165 ఎకరాల్లో పత్తి పంటను వేశారు. వీటిలో కామారెడ్డి జిల్లాకు చెందిన మాల్తుమ్మెదలో 60 ఎకరాలు, నస్రుల్లాబాద్​ మండలానికి చెందిన బొప్పాస్​పల్లిలో 50 ఎకరాలు, ఉమ్మడి నల్గొండ జిల్లా డిండి, చెరకుపల్లిలో 45 ఎకరాల్లో పత్తి పంట సాగవుతోంది. ఈ విధంగా చేస్తున్న ప్రయోగాలు రైతులకు వంటలు పండించడానికి ఎంతగానో సహాయపడుతుందని అంటున్నారు.

ఇది కూడా చదవండి..

తెలంగాణలో భారీగా వారి దిగుబడి.. 1.5 కోట్ల టన్నులు ..

ఇక్కడ చేస్తున్న పరిశీలనల్లో దిగుబడులు అధికంగా వచినట్లయితే, యాసంగిలో వరికి బదులు పత్తిని రైతులు సాగు చేయడానికి అధికారులు ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇక్కడ రైతులు వరి వంటను ఎక్కువగా పండిస్తున్న, దానికి ఉన్న సమస్యల వాళ్ళ పత్తి సాగు చేయడానికి ప్రయోగాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పత్తి పంట నుండి దిగుబడి రావడానికి 4 నుండి 5 నెలలు సమయం పడుతుంది మరియు దిగుబడి అనేది 7 నుంచి 10 క్వింటాళ్ల వరకు ఎకరానికి వస్తుందని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి..

తెలంగాణలో భారీగా వారి దిగుబడి.. 1.5 కోట్ల టన్నులు ..

Share your comments

Subscribe Magazine