News

రైతుల ఖాతాలో 13 వ విడత pm కిసాన్ డబ్బులు

Gokavarapu siva
Gokavarapu siva

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్ధికంగా సహాయం చేయడానికి అనేక పథకాలను అనుగుబాటులోకి తీసుకువస్తుంది. అలాంటి పథకాల్లో ఒకటి ఈ పీఎం కిసాన్. ఇది రైతులకు ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. రైతులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఈ నెల 27న బెల్గాంలో ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ 13వ విడతను చేశారు. దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోండి.

ప్రధానమంత్రి కార్యక్రమం ఈ నెల ఫిబ్రవరి 27న బెల్గాంలోని మాలినీ సిటీలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని పీఎం కిసాన్ పథకం యొక్క 13వ విడత సొమ్మును దేశంలోని రైతుల ఖాతాలకు జమ చేశారు. ఒక్కో రైతుకు రూ.2000 చొప్పున రైతుల అకౌంట్లోకి కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. ఈ డబ్బులను రైతులు వచ్చే రబి సీసన్లో పంటలు పండించుకోవడానికి వాడుకునే విధంగా జమ చేసింది.

ఈ పథకం ప్రవేశపెట్టి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అయింది. ఇప్పటివరకు ఈ పథకం కింద దాదాపుగా 10 కోట్ల మంది రైతులకు దేశంలో లబ్ది చేకూరింది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రారంభించింది.

ఇది కూడా చదవండి..

రైతులకు శుభవార్త :ఫిబ్రవరి 27న PM కిసాన్ విడుదల .. లబ్ధిదారుల జాబితా చెక్ చేయండి ఇలా

దేశమంతటా పూర్తి స్థాయి అమలులోకి 2019లో వచ్చింది. ప్రతి సంవత్సరం రైతుల ఖాతాల్లో 6 వేల రూపాయలను మూడు విడతల చొప్పున అందజేస్తుంది. పీఎం కిసాన్ పథకం ద్వారా 13వ విడత కింద రైతుల ఖాతాల్లోకి రూ.16,800 కోట్లను విడుదల చేసింది. అంటే ఈ సొమ్ముతో దేశంలో నేరుగా 8 కోట్ల మంది రైతులు లబ్ది పొందారు. ఈ పథకం ద్వారా రైతులకు చాలా సహాయపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేసారు.

ఇది కూడా చదవండి..

రైతులకు శుభవార్త :ఫిబ్రవరి 27న PM కిసాన్ విడుదల .. లబ్ధిదారుల జాబితా చెక్ చేయండి ఇలా

Related Topics

PM kisan

Share your comments

Subscribe Magazine