News

వందేభారత్ సికింద్రాబాద్ - విశాఖ 8 గంటలు జర్నీ ... ట్రైన్ షెడ్యూల్&టికెట్ ధరలు ఇవే !

Srikanth B
Srikanth B




రెండు తెలుగు రాష్ట్రాలలో విశాఖ పట్టణం మరియు హైదరాబాద్ ప్రధాననగరాలు మరియు వీటి మధ్య ప్రయాణికుల రాకపోకల రద్దీ కూడా ఎక్కువ, ఇప్పుడు ఈ సమస్యలకు చెక్ పడే అవకాశం వుంది డిసెంబర్ 15 న వందే భారత్ రైలును కింద్రాబాద్ - విశాఖ మధ్య ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారు .

 

 

ఈ క్రమంలో వందేభారత్ రైలు ఇప్పటికే సికింద్రబాద్ స్టేషన్ చేరుకుంది. చెన్నై నుంచి వచ్చిన వందేభారత్ విశాఖ - సికింద్రాబాద్ మధ్య ట్రెయిల్ రన్ పూర్తి చేసారు. సికింద్రాబాద్ - విశాఖ మధ్య ఇప్పటికే పలు రైళ్లు నడుపుతున్నారు. అన్నింటి కంటే వన్డే భారత్ రైలుకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తుంది . వేరే ఎన్ని రైళ్లు నడిచిన మొదత వన్డే భారత్ రైలుకు క్లియరెన్స్ ఇవ్వనున్నారు.

అయితే ఈ రైలు వారంలో ఆరు రోజులు మాత్రమే నడవనుంది. రైలు షెడ్యూల్ ను దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా ప్రకటించింది.


వారంలో 6 రోజులు మాత్రమే నడవనున్న వందే భారత్ :

సోమవారం -శనివారం -విశాఖపట్నంలో ఉదయం 5.45కు బయలుదేరి మధ్యాహ్నం 2.15కు సికింద్రాబాద్‌ స్టేషన్‌ చేరుకుంటుంది.

రిటర్న్ : సాయంత్రం 3 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరి మళ్లీ రాత్రి 11.30కు విశాఖపట్నం చేరుతుంది.

వందేభారత్ లో ఇతర రైళ్లలో లేని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఆటోమేటిక్ డోర్ సిస్టమ్, ఉచిత వైఫై సౌకర్యం అందుబాటులో ఉండే ఈ రైలులో ఏసీ చైర్ కార్ ధర రూ. 1800, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ. 3300 వరకు ఉండొచ్చునని అంచనా. అయితే, విశాఖ - సికింద్రాబాద్ మధ్య పెరుగుతున్న రద్దీ తో పాటుగా ప్రత్యేక సదుపాయాలు ఉండటంతో ఈ రైలుకు భారీ డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 15న తొలి రైలు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం కానుంది.

ప్రధాని మోదీ జనవరి 15న వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు..

 

దురంతో కంటే వేగంగా వందేభారత్

ఇప్పటికి అందుబాటులో ఉన్న రైలు కంటే వేగంగా వన్డే భారత్ ప్రయాణించనుంది , ఇప్పటికి విశాఖ -సిక్కుద్రాబాద్ మధ్య నడుస్తున్న దురంతో ఎక్సప్రెస్ కంటే 2 గంటలు ముందే గమ్యస్థానాని చేరుకోనుంది . విశాఖ - సికింద్రాబాద్ దురంతో ఎక్సప్రెస్ 10 గంటల సమయం పడితే వన్డే భారత్ దాదాపు 8 గంటలలో గమ్యస్థానానికి చేరుకోనుంది .

వేగంగా ప్రయాణించే రైలు :

రాజధాని ఎక్సప్రెస్ -130-140 కి .మీ వేగంతో ప్రయాణిస్తుంది .
గతిమాన్ ఎక్సప్రెస్-160 కిలోమీటర్ వేగంతో
వందే భారత్ ఎక్సప్రెస్-180 కి .మీ వేగం తో నడుస్తుంది .

ప్రధాని మోదీ జనవరి 15న వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు..

 

Related Topics

Vande Bharat train

Share your comments

Subscribe Magazine