News

వాయిదాల పర్వంలో విద్యాదీవెన.. ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేది ఆరోజునే?

Gokavarapu siva
Gokavarapu siva

విద్యా దీవెన కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జమ చేస్తామంటూ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. గడువు ప్రకారం గత నెల లోనే విద్యార్థుల ఖాతాలో జమచేయాలి. భీమవరంలో సభ నిర్వహించి ముఖ్యమంత్రి బటన్‌ నొక్కుతారని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, అనూహ్య పరిస్థితుల కారణంగా, ముఖ్యమంత్రి పర్యటన వాయిదా పడుతూ వస్తుంది.

డిసెంబరు 28న సీఎం భీమవరం పర్యటన ఉంటుందని తాజాగా షెడ్యూల్‌ ప్రకటించారు. ఆ సభలోనే విద్యాదీవెన విడుదల చేస్తారని అంతా ఆశిస్తు న్నారు. ప్రభుత్వం అవసరమైన నిధులు మంజూరు చేయకపోవడంతో ఈ విద్యాసంస్థల నిర్వహణ సవాలక్షంగా మారడంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజుల విడుదల కోసం ఎదురుచూస్తున్నాయి. కళాశాలల నిర్వహణ కోసం యాజమాన్యాలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వం చివరికి ఏడాది క్రితం చెల్లించాల్సిన ఫీజులను విడుదల చేయాలని నిర్ణయించింది, నవంబర్ నెలలో చెల్లింపు గడువు విధించబడింది. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భీమవరం పర్యటన పదే పదే వాయిదా పడుతుండడంతో ప్రభుత్వం నిధుల కొరతను ఎదుర్కొంటుందనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్యా దీవెన జమ చేయడానికి వందల కోట్ల విలువైన డబ్బు చెల్లించాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..

తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఇలా చేస్తే రూ. 500 జరిమాన.!

ముఖ్యమంత్రి బటన్‌ నొక్కుతున్నా సరే విద్యార్థుల ఖాతాలో ఫీజులు జమ కావడం లేదు. కేటగిరీల వారీగా సొమ్ములు విడుదల చేస్తూ వస్తున్నారు. బటన్‌ నొక్కిన తర్వాత వారాల తరబడి విద్యార్థులు ఎదురుచూడక తప్పడం లేదు. ఇదే పరిస్థితి ఉంటే ప్రస్తుత విద్యా సంవత్సరంలో మరో పర్యాయం ప్రభుత్వం సొమ్ములు చెల్లించాలి. అందుకోసం ఇంకెంత కాలం వేచి చూడాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.

ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పై జాప్యం చేస్తున్న ప్రభుత్వం అమలులోనూ నిబంధనలు కఠినతరం చేస్తోంది. ఇప్పటివరకు తల్లుల ఖాతాలో జమ చేస్తోంది. ఇకపై విద్యార్థులతోపాటు, తల్లుల ఉమ్మడి ఖాతా తెరవాలంటూ హడావిడి చేసింది. దానికోసం విద్యార్థులు బ్యాంకుటు చుట్టూ తిరిగారు. జిల్లాలో దాదాపు 75వేల మంది విద్యార్థులకు పీజు రీఎంబర్స్‌మెంట్‌ అమలవుతోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 25 కోట్లు తల్లుల ఖాతాలో జమ చేస్తోంది. ఆ మొత్తాన్ని వారం రోజుల వ్యవధిలోనే కళాశాలలకు చెల్లించాలంటూ షరతు విధిస్తోంది.

ఇది కూడా చదవండి..

తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఇలా చేస్తే రూ. 500 జరిమాన.!

Share your comments

Subscribe Magazine