News

రైతులకు 24 గంటల కరెంటు పై భగ్గుమన్న రాజకీయాలు .. రేవంత్ రెడ్డి అసలు ఏమన్నారంటే !

Srikanth B
Srikanth B
రైతులకు 24 గంటల కరెంటు పై భగ్గుమన్న రాజకీయాలు .. అసలు రేవంత్ రెడ్డి అసలు ఏమన్నారంటే !
రైతులకు 24 గంటల కరెంటు పై భగ్గుమన్న రాజకీయాలు .. అసలు రేవంత్ రెడ్డి అసలు ఏమన్నారంటే !

అమెరికాలో జరిగిన కాంగ్రెస్ మద్దతుదారుల సమావేశంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి .. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా నిన్న అధికార పార్టీ ధర్నా కు పిలుపునిచ్చింది. అయితే అసలు ఇంతలా రాజకీయ చర్చ జరిగే విధంగా రేవంత్ రెడ్డి ఏమన్నారు ?

రేవంత్ రెడ్డి ఏమన్నారు ?

అమెరికాలో జరిగిన కాంగ్రెస్ మద్దతుదారుల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో 95 శాతం మంది రైతులకు మూడెకరాల లోపు భూమి ఉంది. ఒక ఎకరా భూమికి నీరందించడానికి ఒక గంట విద్యుత్ సరఫరా సరిపోతుంది, తద్వారా మూడు ఎకరాలకు మూడు గంటల విద్యుత్ సరఫరా సరిపోతుంది. విద్యుత్ సంస్థల కమీషన్ల కోసమే (ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు) కేసీఆర్ 24 గంటల కరెంటు నినాదాన్ని రూపొందించారు. ఉచిత విద్యుత్ పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఉచితాలను మన స్వార్థం కోసం ఉపయోగించుకోలేం' అని చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్ వెంటనే వైరల్ అయింది.

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమన్నారు ?

రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా తమ పార్టీ విధానమని, దానిని పార్టీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 24 సెకన్ల పాటు కూడా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా చూస్తామన్నారు.

300 రేషన్‌ దుకాణాల్లో రూ. 60 కి టమాటో విక్రయాలు..

కాగా, రేవంత్‌ని తప్పు పట్టిన టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. 20 ఏళ్ల క్రితం ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్సేనని అన్నారు. అప్పట్లో రేవంత్ టీడీపీలో ఉన్నారని, ఆ విషయంపై ఆయనకు అవగాహన ఉండదని వెంకట్ రెడ్డి అన్నారు. తన ప్రకటనపై స్పష్టత ఇవ్వాలని రేవంత్‌ను ఆయన కోరారు.

300 రేషన్‌ దుకాణాల్లో రూ. 60 కి టమాటో విక్రయాలు..

Related Topics

PCC chief Revanth Reddy,

Share your comments

Subscribe Magazine