News

మీ ఓటర్ ఐడీ కార్డు కనిపించట్లేదా.? - ఈ విధంగా చేస్తే కొత్త కార్డు సులువుగా పొందొచ్చు..!

Gokavarapu siva
Gokavarapu siva

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ఉత్కంఠ రేగుతోంది. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడంతో ప్రజల్లో ఉత్కంఠ, నిరీక్షణ మొదలైంది. అన్ని వర్గాల పౌరులు ఇప్పుడు తమ ప్రాథమిక ఓటు హక్కును వినియోగించుకోవడంపై ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు మరియు వారి ఓటరు కార్డులకు ఏవైనా అవసరమైన సవరణలు లేదా నవీకరణలను తక్షణమే పరిష్కరించేలా చూసుకుంటున్నారు.

అయితే, ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్ ఐడీ చాలా కీలకం. చాలా మందికి ఓటు వేసే సమయంలోనే ఓటర్ ఐడీ గుర్తొస్తుంది. ఒక్కోసారి అది కనిపించకుండా పోవచ్చు లేదా పూర్తిగా పాడైపోవచ్చు. అలాంటి సమయంలో డూప్లికేట్ ఓటర్ ఐడీ పొందేలా ఈసీ వెసులుబాటు కల్పించింది. దీన్నీ ఆన్ లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు.

➨ తొలుత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిక వెబ్ సైట్ https://voters.eci.gov.in ను సందర్శించాలి. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల కోసం రూపొందించిన ఫాం-8నే దీని కోసం వినియోగించాల్సి ఉంటుంది.

➨ https://voters.eci.gov.in లోకి వెళ్లి మీ వివరాలతో లాగిన్ కావాలి. డూప్లికేట్ ఓటర్ ఐడీ కార్డు కోసం ఫాం EPIC-002 కాపీని డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ ఫాంను పూరించి అన్ని పత్రాలు అటాచ్ చేయాలి.

ఇది కూడా చదవండి..

మహిళా రైతులకు మోడీ ప్రభుత్వం శుభవార్త.. 15 వేల డ్రోన్లు అందించనున్న ప్రభుత్వం

➨ ఓటర్ ఐడీ పోయినట్లుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు కాపీ (ఎఫ్ఐఆర్), అడ్రస్, గుర్తింపు పత్రాలను జత చేయాలి.

➨ ఈ ఫాంను స్థానిక ఎన్నికల కార్యాలయానికి సమర్పించాలి. అనంతరం మీకు రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దీని ద్వారా ఈసీ వెబ్ సైట్ లో మీ దరఖాస్తు స్టేటస్ ట్రాక్ చెయ్యొచ్చు.

➨ మీ దరఖాస్తు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తైతే కార్డు జారీ అయినట్లు మీకు సందేశం వస్తుంది.

ఇది కూడా చదవండి..

మహిళా రైతులకు మోడీ ప్రభుత్వం శుభవార్త.. 15 వేల డ్రోన్లు అందించనున్న ప్రభుత్వం

Share your comments

Subscribe Magazine