Agripedia

కిలో బంగాళదుంప 500 రూపాయలు.. ఈ నల్ల బంగాళదుంప గురించి మీకు తెలుసా!

Gokavarapu siva
Gokavarapu siva

సాధారణంగా రైతులు బంగాళదుంప పంటను సాగు చేసి మార్కెట్లోకి విక్రయిస్తారు. కానీ బీహార్ కు చెందిన ఒక రైతు వినూత్నంగా ఆలోచించి నల్ల బంగాళదుంప పంటను సాగు చేసాడు. ఈ నల్ల బంగాళదుంప పంటను సాగు చేయడంతో ఈ విషయం అందరిని ఆశ్చర్యపరిచి చర్చనీయాంశంగా మారింది. ఈ పంటను పండించడమే కాదు, దీనితో ఈ రైతు అధిక లాభాలను కూడా పొందుతున్నాడు. దీనికి సంబంధించిన విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ నల్ల బంగాళదుంప పంటను పండించిన రైతు పేరు ఆశిష్ సింగ్. ఈ రైతు బీహార్ రాష్ట్రానికి చెందినవాడు. ఈ రైతుకు యూట్యూబ్ చేసే అలవాటు ఉంది. ఈ రైతు వినూత్నంగా ఏదోకటి చేయాలనీ బత్తాయి గురించి వెతుకుతుంటే అతనికి ఈ నల్ల బంగాళదుంప గురించి తెలుసుకున్నాడు. అప్పటి నుండి ఈ రైతు ఈ నల్ల బంగాళదుంప సాగు చేసే విధానాలను వెతుకుతూ ఈ పంటను పండించి అందరిని ఔరా అనిపించాడు.

సాదరణంగా ఈ నల్ల బంబాళదుంప పంటను అమెరికాకు చెందిన ఆండీస్ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తారు. బీహార్ చెందిన ఈ రైతు ఈ పంటను పండించడానికి నల్ల బంగాళాదుంప విత్తనాలను అమెరికా నుండి ఆర్డర్ చేసాడు. సుమారుగా పంట పండించడానికి ఒక కిలో విత్తనాలకు రూ.1500 వ్యయం చెల్లించి, 14 కిలోల విత్తనాలను కొనుగోలు చేసాడు. ఇలా కొనుగోలు చేసిన విత్తనాలను బీహార్ కు చెందిన తికారీ బ్లాక్‌లోని గుల్రియాచక్ గ్రామంలో పంట సాగు చేసాడు.

ఇది కూడా చదవండి..

తెలంగాణాలో 3 రోజుల పాటు వర్షాలు .. వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ !

ఈ నల్ల బంగాళాదుంప ఈ మర్చి నెలలో మొదటి పంట కూడా వచ్చింది. ఈ రైతు నవంబర్ నెలలో విత్తనాలు నాటగా మొన్న మర్చి 13న అనగ 120 రోజుల తరువాత పంట పండింది. పంట వేసినప్పుడు ఈ రైతు సుమారుగా 200 కిలోల దిగుబడి వస్తుంది అని ఆశించాడు, కానీ వాతావరణ పరిస్థితుల కారణంగా 120 కిలోల దిగుబడి మాత్రమే వచ్చింది.

బయట మార్కెట్లో ఈ నల్ల బంగాళదుంపకు రూ.300-500 ఒక కిలోకి అమ్మాలని నిర్ణయించారు. ఈ రైతును స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో మిగతా రైతులు కూడా ఈ నల్ల బంగాళాదుంప పంటను సాగు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నల్ల బంగాళాదుంపకు డిమాండ్ కూడా బాగా పెరిగింది. ప్రతుతం ఈ రైతు కొంత భూమిలో మాత్రమే ఈ పంటను పండిస్తున్నాడు. ఇప్పుడు దీనిని ఇంకా విస్తరించే ఆలోచనలో ఉన్నాడు.

ఇది కూడా చదవండి..

తెలంగాణాలో 3 రోజుల పాటు వర్షాలు .. వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ !

Related Topics

black potato cultivation

Share your comments

Subscribe Magazine