Agripedia

వేరుశెనగలో అధిక దిగుబడిని ఇచ్చే కొత్త వెరైటీ..

Gokavarapu siva
Gokavarapu siva

తెలుగు రాష్ట్రాల్లో వేరుశెనగ పంటకు పత్యేక స్థానం ఉంది. ఆంధ్రప్రదేశ్ వేరుశెనగ ఉత్పత్తిలో భారతదేశంలో 4వ స్థానంలో ఉంది. వేరుశెనగ పంటను అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కృష్ణ మొదలగు జిల్లాలో అధికంగా సాగు చేస్తారు. ప్రస్తుతకాలంలో ఈ వేరుశెనగ పంటను చీడపురుగుల బెడద ఎక్కువై పంటకు నష్టం వాటిల్లుతుంది. దీనితో ఈ వేరుశెనగ సాగు చేసే రైతులకు లాభాలు తగ్గిపోయాయి.

ఈ తెగుళ్ల సమస్యకు సంబంధించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం రైతులకు శుభవార్త తెలియాజేసింది. ఇక్కడ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి, వేరుశెనగలో కొత్త రకం వంగడాన్ని తయారుచేసింది. ఈ వంగడం పేరు వచ్చేసి టీసీజీఎస్– 1694 (విశిష్ట). ఈ విశిష్ట వంగడాన్ని రైతులు సాగు చేయడం ద్వారా వారికి ఈ ఆకుపచ్చ తెగులు సమస్యను తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విశిష్ట వంగడంతో సాధారణ రకం కంటే 15 శాతం అధన దిగుబడి కూడా వస్తుంది.

గత సంవత్సరం ఈ విశిష్ట వంగడాన్ని ప్రయోగాత్మక సాగు చేశారు. ఈ ప్రయోగాత్మక సాగు విజయవంతం అవ్వింది. కాబట్టి రైతులకు ఈ వంగడాన్ని ఖరీఫ్ నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. ఈ వశిష్ట రకం వంగడాన్ని కదిరి–6 మరియు ఐసీజీ (ఎఫ్ఎఆర్ఎస్) - 79 రకాలను సంకరపరచడం ద్వారా దీనిని అభివృద్ధి చేశారు.

ఇది కూడా చదవండి..

ఇంటి వద్ద నుంచే .. సాయిల్ హెల్త్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోండి !

కదిరి మరియు లేపాక్షి నబీటి వేరుశెనగ రకాలు హెక్టర్ పొలం నుండి 20-25 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తున్నాయి. కానీ వాటిలో గింజ దిగుబడి అనేది 60 శాతం దాటట్లేదు. కానీ కొత్తగా విశిష్ట రకం మాత్రం 70-75 శాతం గింజ దిగుబడి ఉంటుంది. కాబట్టి రైతులు ఈ వంగడాన్ని సాగు చేయడంతో అధిక దిగుబడిని పొందవచ్చు.

సాదరణంగా మన తెలుగు రాష్ట్రాల్లో పండించడానికి వాడే రకాలైన కదిరి–6, ధరణి, టీఏజీ-24 ఎక్కువగా నీటి ఎద్దడిని మరియు ఆకుమచ్చ తెగులును కూడా తట్టుకోలేకపోయితున్నాయి. దీనితో వీటిని అరికట్టడానికి పొలంలో మందులను పిచికారీ చేయడం అనేది రైతులకు భారంగా మారుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం రైతులకు అధిక దిగుబడులను మరియు ఆకుమచ్చ తెగులును తట్టుకోగలిగే వంగడాన్ని అభివృద్ధి చేశారు.

ఇది కూడా చదవండి..

ఇంటి వద్ద నుంచే .. సాయిల్ హెల్త్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోండి !

Related Topics

groundnut high yieding

Share your comments

Subscribe Magazine