Agripedia

దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 315.72 మిలియన్ టన్నులుగా అంచనా : 2020-21లో 4.98 మెట్రిక్ టన్నుల పెరుగుదల

Srikanth B
Srikanth B

2021-22 సంవత్సరానికి ప్రధాన వ్యవసాయ పంటల ఉత్పత్తికి సంబంధించిన నాల్గవ ముందస్తు అంచనాలను కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 315.72 మిలియన్ టన్నులుగా అంచనా వేయబడింది, ఇది 2020-21లో ఆహార ధాన్యాల ఉత్పత్తి కంటే 4.98 మిలియన్ టన్నులు ఎక్కువ. 2021-22లో ఉత్పత్తి గత ఐదు సంవత్సరాల (2016-17 నుండి 2020-21) ఆహారధాన్యాల సగటు ఉత్పత్తి కంటే 25 మిలియన్ టన్నులు ఎక్కువగా ఉంది.

వరి, మొక్కజొన్న, శనగలు, పప్పుధాన్యాలు, రాప్‌సీడ్, ఆవాలు, నూనెగింజలు, చెరకు రికార్డు ఉత్పత్తి అంచనా. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్ధవంతమైన నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు అనుకూల విధానాలతో పాటు అవిశ్రాంత కృషి ఫలితంగానే ఇన్ని పంటలు ఈ రికార్డు స్థాయిలో ఉత్పత్తి అవుతున్నాయని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు.

4వ అడ్వాన్స్ అంచనాల ప్రకారం, 2021-22లో ప్రధాన పంటల అంచనా ఉత్పత్తి క్రింది విధంగా ఉంది:

ఆహారధాన్యాలు 315.72 మిలియన్ టన్నులు, బియ్యం 130.29 మిలియన్ టన్నులు (రికార్డ్), గోధుమలు 106.84 మిలియన్ టన్నులు, న్యూట్రి / ముతక తృణధాన్యాలు 50.90 మిలియన్ టన్నులు, మొక్కజొన్న 33.62 మిలియన్ టన్నులు, పప్పుధాన్యాలు 27.69 మిలియన్ టన్నులు (రికార్డు), మినుములు 4.34 మిలియన్ టన్నులు, కందులు 13.75 మిలియన్ టన్నులు (రికార్డు), నూనె గింజలు 37.70 మిలియన్ టన్నులు (రికార్డు), వేరుశనగ 10.11 మిలియన్ టన్నులు, సోయాబీన్ 12.99 మిలియన్ టన్నులు (12.99 మిలియన్ టన్నులు రికార్డు), చెరకు 431.81 మిలియన్ టన్నులు (రికార్డ్), పత్తి 31.20 మిలియన్ బేళ్లు (ఒక్కొక్కటి 170 కిలోలు), జూట్ & మెస్తా 10.32 మిలియన్ బేళ్లు (ఒక్కొక్కటి 180 కిలోలు).

2021-22లో మొత్తం బియ్యం ఉత్పత్తి రికార్డు 130.29 మిలియన్ టన్నులుగా అంచనా. గత ఐదేళ్ల సగటు ఉత్పత్తి 116.44 మిలియన్ టన్నుల కంటే ఇది 13.85 మిలియన్ టన్నులు ఎక్కువ.

2021-22లో గోధుమల ఉత్పత్తి 106.84 మిలియన్ టన్నులుగా అంచనా. గత ఐదేళ్ల సగటు గోధుమ ఉత్పత్తి అయిన 103.88 మిలియన్ టన్నుల కంటే ఇది 2.96 మిలియన్ టన్నులు ఎక్కువ.

తెలంగాణ లోని 5 జిల్లాలలో 100 శాతం కుళాయిల ద్వారా నీరు సరఫరా..

న్యూట్రి / ముతక తృణధాన్యాల ఉత్పత్తి 50.90 మిలియన్ టన్నులుగా అంచనా, ఇది గత ఐదేళ్ల సగటు ఉత్పత్తి 46.57 మిలియన్ టన్నుల కంటే 4.32 మిలియన్ టన్నులు ఎక్కువ. 2021-22లో మొత్తం పప్పుధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 27.69 మిలియన్ టన్నులుగా అంచనా. గత ఐదేళ్ల సగటు ఉత్పత్తి 23.82 మిలియన్ టన్నుల కంటే 3.87 మిలియన్ టన్నులు. 2021-22లో దేశంలో మొత్తం నూనెగింజల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 37.70 మిలియన్ టన్నులుగా అంచనా, ఇది 2020లో 35.95 మిలియన్ టన్నుల ఉత్పత్తి కంటే 1.75 మిలియన్ టన్నులు ఎక్కువ. ఇంకా, 2021-22లో నూనెగింజల ఉత్పత్తి సగటు నూనె గింజల ఉత్పత్తి కంటే 5.01 మిలియన్ టన్నులు ఎక్కువగా ఉంది.

2021-22లో దేశంలో చెరకు మొత్తం ఉత్పత్తి రికార్డు స్థాయిలో 431.81 మిలియన్ టన్నులుగా అంచనా, ఇది సగటు చెరకు ఉత్పత్తి 373.46 మిలియన్ టన్నుల కంటే 58.35 మిలియన్ టన్నులు ఎక్కువ.

పత్తి, జనపనార-మేస్టా ఉత్పత్తి వరుసగా 31.20 మిలియన్ బేళ్లు (ఒక్కొక్కటి 170 కిలోలు), 10.32 మిలియన్ బేళ్లు (ఒక్కొక్కటి 180 కిలోలు)గా అంచనా వేయడం జరిగింది.

వివిధ పంటల ఉత్పత్తి అంచనా రాష్ట్రాల నుండి స్వీకరించిన డేటాపై ఆధారపడి ఉంటుంది. ఇతర వనరుల నుండి లభ్యమయ్యే సమాచారంతో ధృవీకరించడం జరుగుతుంది. 2021-22కి సంబంధించి 4వ ముందస్తు అంచనాల ప్రకారం వివిధ పంటల ఉత్పత్తిని తులనాత్మక అంచనాల ప్రకారం అంచనా వేయడం జరిగింది.

తెలంగాణ లోని 5 జిల్లాలలో 100 శాతం కుళాయిల ద్వారా నీరు సరఫరా..

Share your comments

Subscribe Magazine