Agripedia

యాసంగి ప్రారంభం లోనే రికార్డు స్థాయిలో 10 లక్షల ఎకరాలో వరి సాగు ...

Srikanth B
Srikanth B
Paady Cultivation yadadri
Paady Cultivation yadadri

యాసంగి సీజన్ ప్రారంభములోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తముగా రికార్డు స్థాయిలో 10 లక్షల ఎకరాలలో వరి నాట్లు పూర్తయ్యాయి. గత ఏడాది ఇదే సమయం లో 4 లక్షల ఎకరాలలో పంట సాగు జరిగితే ఈసారి ఏకంగా 10 లక్షల ఎకరాలలో నాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి , గత సంవత్సరం మొత్తం 33 లక్షల ఎకరాలలో వరి సాగు జరిగింది. ప్రభుత్యం పంటను ప్రభుత్వం కొనదనే నేపథ్యం ఉన్న రైతులు 33 లక్షల ఎకరాలలో పంటను సాగు చేసారు , అయితే ఈ ఏడాది దానికి భిన్నముగా 55 లక్షల ఎకరాలలో వారి సాగు అయ్యే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయ నిపుణు తెలుపుతున్నారు .

 

అయితే ప్రయోగాత్మకంగా పత్తి 6 వందల ఎకరాలలో ఇప్పటికే సాగు జరిగితే , మిర్చి , ఉల్లి సాగు ఇంకా రైతులు ప్రారంభించలేదు .

పంటల వారీగా సాగు వివరాలు ;

వరి 

10,45957  ఎకరాలలో 

గోధుమ

4048        ఎకరాలలో 

జొన్న

56715      ఎకరాలలో 

సజ్జలు

18342      ఎకరాలలో 

రాగి

1072      ఎకరాలలో 

కొర్ర

40          ఎకరాలలో 

మిర్చి

0          ఎకరాలలో 

ఉల్లి

0          ఎకరాలలో 

పత్తి

668        ఎకరాలలో 

పురుగు మందు డబ్బాలపై ఉండే ఈ గుర్తులకు అర్ధం ఏంటో తెలుసా !

అత్యధికముగా నిజామాబాద్ 2,42,259, కరీంనగర్ -1,24,313,నల్లగొండ , 1,26,550 , సూర్యాపేట 68,137 యాదాద్రి లో 86,982వేల ఎకరాలలో వరి నాట్లు పూర్తయ్యాయి . గత ఏడాది తో పోలిస్తే గరిష్టముగా సాగు జారింది , భూగర్భ జలాలు పెరగడం , నీటి లభ్యత అధికముగా ఉండడంతో రైతులు వరి నాట్ల వైపు మొగ్గు చూపుతున్నారు .


తెలంగాణ ప్రభుత్వం వరికి ప్రత్యమ్న్యాయం గ ప్రత్తి సాగును ప్రోత్సహించాలని భావిస్తుంది దానిలో భాగంగానే యాసంగిలో వివిధ విత్తన కేంద్రానికి సంబందించిన భూమిలో దాదాపు 200 ఎకరాలలో ప్రత్తి సాగు చేయాలనీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నిర్ణయించింది .అయితే దానికి భిన్నముగా రైతులు 668 ఎకరాలలో పత్తి సాగు చేసారు .

పురుగు మందు డబ్బాలపై ఉండే ఈ గుర్తులకు అర్ధం ఏంటో తెలుసా !

Share your comments

Subscribe Magazine