Agripedia

కేంద్ర పథకం.. ఈ పంట సాగుపై 50 శాతం సబ్సిడీ.. ఎకరానికి రూ.4 లక్షల వరకు ఆదాయం!

Gokavarapu siva
Gokavarapu siva

రైతుల ఆదాయాన్ని రెండింతలు పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమాలలో భాగంగా, కొన్ని పంటల సాగు చేస్తున్న రైతులకు పెట్టుబడిలో 50 శాతం అందిస్తున్నారు. దానితోపాటు మొదటి పంట నుండే ఎకరాకు రూ.4 లక్షల ఆదాయాన్ని పొందవచ్చని కూడా చెబుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మన దేశంలో, అనేక ఎకరాల్లో విస్తారమైన సాగు భూమి ఉంది. ముఖ్యంగా తగినంత నీటి సరఫరా ఉన్న ప్రాంతాలలో వరి, మొక్కజొన్న మరియు గోధుమ వంటి అవసరమైన ఆహార పంటలను రైతులు సాగు చేస్తున్నారు. అయితే మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా వాణిజ్య పంటలు వేస్తుంటారు. దేశంలో ఎక్కువ శాతం రైతులు సాంప్రదాయ పంటలనే సాగు చేయడంతో, వారికి ఎక్కువ లాభాలు రావట్లేదు.

వ్యవసాయం నుండి ఏక్కువ ఆదాయం వస్తుందన్న కారణంతో, దేశంలోని ప్రజలు వ్యవసాయంవైపు మొగ్గుచూపుతున్నారు. దేశంలోని యువత వాణిజ్య పంటలను సాగు చేసి మంచి ఆదాయాన్ని పొందాలని ఎక్కువుగా భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో దేశంలో వెదురుకు మంచి డిమాండ్ ఉంది. దీని కారణంగా ప్రభుత్వం వెదురు పంట సాగు కొరకు రైతులను ప్రోత్సహిస్తుంది. వెదురు పండించే రైతులకు సబ్సిడీ ఇస్తోంది.

దేశంలోని వ్యవసాయ నిపుణులు, వ్యవసాయం ద్వారా మంచి లాభాలు పొందాలనుకుంటే వెదురు సాగు ఒక మంచి ఎంపిక అని చెబుతున్నారు. ప్రభుత్వమే నేరుగా పెట్టుబడిలో 50 శాతం సబ్సిడీ ఇస్తుండడం మంచి అవకాశమని సూచిస్తున్నారు. ఈ పంటను సాగు చేయడంలో ముఖ్య ప్రయోజనం ఏమిటంటే, వెదురు అనేది బంజరు భూముల్లో కూడా బాగా పెరుగుతాది.

ఇది కూడా చదవండి..

ఈ పంట సాగుకు ఎక్కువ నీరు కూడా అవసరం ఉండదు. చాలా తక్కువ మొత్తం నీటితోనే పంట సాగు చేసేందుకు వీలవుతుంది. ఈ మొక్కలు ఒక్కసారి నాటితే 50 ఏళ్ల వరకు ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. వెదురు పెంపకానికి కూలీల అవసరాలు చాలా తక్కువ. ఒక హెక్టారు భూమిలో 1500 వెదురు మొక్కలు నాటుకోవచ్చు.

బంబూసా ఒరాండినేసి, బంబుసా పాలిమార్ఫా, కిమోనో బాంబుసా ఫాల్కాటా, డెండ్రోకాలమస్ స్ట్రిక్స్, డెండ్రోకాలామస్ హోమిల్టోని మరియు మెలోకానా బెకిఫెరా వంటి అనేక ప్రసిద్ధ వెదురు జాతులకు మార్కెట్ అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఈ జాతులను రైతులు ఎంచుకుని సాగు చేయవచ్చు. అంతేకాకుండా, వెదురుకు అధిక డిమాండ్ మరియు ప్రజాదరణ కారణంగా, రైతులు తమ పంటలను సులభంగా విక్రయించవచ్చు మరియు వారి ఉత్పత్తులకు మంచి ధరను పొందవచ్చు.

ఇది కూడా చదవండి..

ఉద్యోగులకు గుడ్ న్యూస్: వారికి ఖాలి స్థలాలు అందించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..

ఈ పంట సాగుకు కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయాన్ని అందిస్తుంది. వెదురు సాగుకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నాయి. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి రైతులు నేషనల్ బాంబూ మిషన్ అధికారిక వెబ్‌సైట్ NBM.nic.inలోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిలో భాగంగా, జాతీయ వెదురు మిషన్ కింద ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక నోడల్ అధికారిని నియమించారు, వారి నుండి మరింత సమాచారం పొందవచ్చు.

వెదురు మొక్క నాటిన 4 సంవత్సరాల తరువాత మొదటి కోత వస్తుంది. ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక ఎకరానికి రూ. 4 లక్షల ఆదాయం పొందవచ్చు. అంటే హెక్టారుకు రూ.12 లక్షల వరకు వస్తుంది. ఒకవేళ వెదురుతో అంతర పంట కనుక వేస్తే, దాని నుండి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.

ఇది కూడా చదవండి..

ఉద్యోగులకు గుడ్ న్యూస్: వారికి ఖాలి స్థలాలు అందించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..

Share your comments

Subscribe Magazine