Agripedia

స్ట్రాబెర్రీ పంట...లక్షల్లో ఆదాయం

KJ Staff
KJ Staff

స్ట్రాబెర్రీ అంటే ఇష్టం ఉండనివారు ఉండరు. ఎర్రని రంగులో ఉన్నఈ పండును చూడగానే నోరూరుతుంది. ఒక్కసారి తింటే ఆ పండు మాధుర్యం మనల్ని మరిచిపోనివ్వదు.గతంలో విదేశాలకు మాత్రమే పరిమితమైన స్ట్రాబెర్రీ పంట ఇప్పుడు మన దేశంలో కూడా విస్తరణ జరుగుతుంది. స్ట్రాబెర్రీ పంటను కోరాపుట్ జిల్లాలోని కోటియా ప్రాంతంలో అధికంగా సాగు చేస్తున్నారు. ఇక్కడ రైతులు అధికారుల సహాయంతో ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నారు మరియు ఆర్ధికంగా నిలదొక్కుకుంటున్నారు. ఈ స్ట్రాబెర్రీల రుచి కూడా చాలా బాగుంటుంది.

స్ట్రాబెర్రీ సాగు కోరాపుట్ జిల్లాలోని కోటియా ప్రాంతంలో అధికంగా ఉంది. ఈ ప్రాంతంలో పండిస్తున్న స్ట్రాబెర్రీ రుచి అద్భుతంగా ఉంది అని సీఎం నవీన్ పట్నాయక్ కొనియాడారు. సాధారణంగా కొండ ఛాయా ప్రాంతాలైన దక్షిణ, నైరుతి ఒడిశా జిల్లాలో ఈ స్ట్రాబెర్రీ పంటను పండించడానికి అనుకూలంగా ఉంటుంది. సముద్ర మట్టానికి సుమారు 3,000 అడుగుల ఎత్తులో ఉన్న కొరాపుట్, నువాపడా జిల్లాల్లో స్ట్రాబెర్రీ పండించవచ్చు. దీంతో వాణిజ్యపరంగా ఇక్కడ పంటను అభివృద్ధి చేసేందుకు అధికారులు చురుకుగా సన్నాహాలు చేస్తున్నారు.

కోరాపుట్ జిల్లాలోని వ్యవసాయ సఖ అధికారులు అక్కడి రైతులకు స్ట్రాబెర్రీ పంటను ఎలా పండించాలో శిక్షణ ఇచ్చి ప్రోత్సహించారు. మొదట ఈ స్ట్రాబెర్రీ పంటను 5 ఎకరాల్లో సాగు ప్రారంభించారు. 55,000 స్ట్రాబెర్రీ మొక్కలను పూణే నుంచి తెప్పించారు. ఇక్కడి ప్రభుత్వం ఇంచుమించుగా 45 రైతు కుటుంబాలకు స్ట్రాబెర్రీ సాగు శిక్షణా అందించారు. సాగు ఫలితాలు 50 రోజుల్లోనే కనిపించడంతో సాగుపై ఆసక్తి చూపారు. కోటియాలో స్ట్రాబెర్రీ సాగు ఊహకు అందని విధంగా ఫలితాలు ఇచ్చింది. ప్రస్తుతం 20 ఎకరాల్లో విస్తీర్ణంలో స్ట్రాబెర్రీ సాగుకు శ్రీకారం చుట్టారు.

ఇది కూడా చదవండి..

వరి సాగుకు ప్రత్యామ్నాయ పంటలుగా బ్రహ్మి, వస పంటలు..

రైతు సాధికారత శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ డాక్టర్‌ అరబింద కుమార్‌ పాఢీ ఇటీవల కొటియా పర్యటన పురస్కరించుకొని స్టాబెర్రీ సాగు రైతులతో సమావేశమయ్యారు. స్ట్రాబెర్రీ సాగుకు పూర్తిస్థాయిలో సహాయం అందజేయనున్నట్లు తెలియజేశారు. సాగు విస్తరణకు అంకితభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రైతులు నారు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. స్ట్రాబెర్రీ సాగు ఒకసారి విజయవంతమైతే ఇతర పండ్ల సాగు కంటే చాలా లాభదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఇక్కడ స్ట్రాబెర్రీ పంట లాభసాటిగా సాగుతుంది. ఒక చిన్న స్ట్రాబెర్రీ ప్యాకెట్ అమ్మితే రూ.100 వరకు లాభం వస్తుంది అని రైతులు హర్షం వ్యక్తం చేసారు. మొదటి ఏడాదిలోనే రూ. 4.60 లక్షల టర్నోవర్ రావడం విశేషం. ఈ విస్తీర్ణం కొరకు 6 లక్షల మొక్కలను నాటినట్లు జిల్లా ప్రోగ్రాం కో-ఆర్డినేషన్ వర్గాలు తెలిపాయి.

ఇది కూడా చదవండి..

వరి సాగుకు ప్రత్యామ్నాయ పంటలుగా బ్రహ్మి, వస పంటలు..

Share your comments

Subscribe Magazine