Agripedia

నిజామాబాద్ లో ప్రయోగాత్మకంగా కొత్త రకం "ముళ్ల జొన్న" సాగు ..

Srikanth B
Srikanth B

 

చిరు ధాన్యాల ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు , ఏకంగా 2023 సంవత్సరాని ఐక్య రాజ్య సమితి మిల్లెట్ ఇయర్ (చిరుధాన్యాల సంవత్సరం ) గ ప్రకటించిన విషయం తెలిసిందే భారతదేశం లో కూడా చిరుధాన్యాల సాగు పై ప్రత్యేక దృష్టి పెట్టింది దిశగా చిరుధాన్యాల సాగు కోసం ప్రచారాన్ని నిర్వహిస్తుంది. ఇదిలా ఉంటె తెలంగాణ నిజామాబాద్ రైతులు కొత్త రకం జొన్న సాగును ప్రయోగాత్మకంగా ప్రారంభించారు .

మన పూర్వికులు సాగుచేసిన మాఘి జొన్ననే ఎప్పుడు నిజామాబాద్ రైతులు 'ముళ్ల జొన్న'గా సరికొత్త రూపంలో మళ్లీ వచ్చింది. అనుకూలమైన నేలలు, తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే ఈ పంటను ఇప్పటికే నిజామాబాద్‌ జిల్లాలో వందల ఎకరాల్లో సాగు చేస్తుండగా ఇప్పుడు మన దగ్గరా ప్రయోగాత్మ కంగా సాగవుతోంది.

ఎల్కతుర్తి మండలంలో ఏడెకరాల్లో సాగు చేస్తున్నారు. ఏపుగా పెరిగి మంచి దిగుబడి అంచనా కనిపిస్తోంది. మరోవారం, పది రోజుల్లో కోతకు వస్తుంది. దీని కంకి చుట్టూరా అత్యంత పదునుతో సన్నని ముండ్లు ఉండడంతో పిట్టలు దీనిపై వాలవు. ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటాలుకు రూ.4వేల చొప్పున విత్తన కంపెనీ కొనుగోలు చేస్తుంది. సాధారణ హార్వెస్టర్‌తోనే ఈ పంటను కోయవచ్చు. ఈ పంటకు చీడపీడలు కూడా తక్కువేనని.. కేవలం మూడు నీటి తడులతో పంట కాలం పూర్తవుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. దిగుబడిలో గనుక విజయవంతం అయినట్లయితే మక్కజొన్న, వరికి ప్రత్యామ్నాయంగా పండించవచ్చంటున్నారు.

యాసంగిలో ప్రయోగాత్మకంగా 200 ఎకరాలలో ప్రత్తి సాగు ..

ఇప్పుడు ముళ్ల జొన్నగా..జొన్న పంట అనేక రూపాంతరాలు చెందుతూ ఇప్పుడు ముళ్ల జొన్నగా వచ్చింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఇప్పటికే బహుళ ప్రాచుర్యం పొందింది. ప్రతి యాసంగిలోనూ విరివిగా సాగు చేస్తున్నారు. మన వాతావరణం, భూములు కూడా ఈ పంటకు అనుకూలంగా ఉండడంతో ప్రోలైన్‌ అనే విత్తన కంపనీ ఇక్కడికి ఈ పంటను తీసుకొచ్చింది.

యాసంగిలో ప్రయోగాత్మకంగా 200 ఎకరాలలో ప్రత్తి సాగు ..

Related Topics

sorghum cultivation

Share your comments

Subscribe Magazine