Agripedia

అల్లం సాగులో అధిక దిగుబడినిచ్చే రకాలు, వాటి ప్రాముఖ్యత...!

KJ Staff
KJ Staff

దుంప జాతి సుగంధ ద్రవ్యంగా ఎంతో ప్రాముఖ్యత పొందిన అల్లానికి దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా స్థిరమైన ధర ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో అల్లం పంటను సాగు చేస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.అల్లం పంట సాగు సాధారణ పంటలతో పోలిస్తే పెట్టుబడి ఎక్కువైనప్పటికీ ఆదాయం కూడా భారీగానే సమకూరుతుంది.అల్లం సాగుకు వేడితో కూడిన అధిక తేమ గల వాతావరణం అనుకూలమైనదిగా చెప్పవచ్చు.మురుగు నీటి వసతి ఉన్న అధిక సేంద్రియ పదార్థం గల మెత్తటి ఎర్ర గరప నేలలు, చల్కా నెలలు అనుకూలంగా ఉంటాయి.నీరు నిలిచే బంకమట్టి నేలల్లో అల్లం సాగు చేస్తే దుంప కుళ్ళు తెగులు వచ్చి తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో అల్లం సాగుకు ఏప్రిల్ రెండో వారం నుంచి మే మూడో వారం వరకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. అల్లం సాగులో ఎక్కువ పెట్టుబడి విత్తన దుంపలు కొనుగోలుకే అవుతుంది. క్వింటా విత్తనం కోసం దాదాపు 5 వేల నుంచి 6 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.ప్రతి ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల విత్తనం అవసరం అవుతుంది. కాబట్టి సుమారు రూ. 60 వేల వరకు విత్తనాలకే ఖర్చవుతుంది. కాబట్టి విత్తన అల్లం దుంపలను మన ప్రాంత నేలకు, వాతావరణానికి అనువైనవి ఎంపిక చేసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి.

అల్లం రకాలు :

సిద్దిపేట రకం: తెలంగాణా ప్రాంతానికి అత్యంత అనువైన రకం. ఈ రకాన్ని తాజా అల్లం ఎక్కువగా ఉపయోగిస్తారు.దీని పంటకాలం 210 రోజులు ఉండి,ఎకరాకు అత్యధికంగా 12 టన్నుల అల్లం దిగుబడినిస్తుంది.

మారిస్ అల్లం రకం : ఈ రకం అల్లంలో తక్కువ పీచు ఉండి ఎక్కువ శాతం నూనె మరియు ఓలియోరెసిన్ ఉంటుంది. పంటకాలం 200 రోజులు ఉండి,ఎకరాకు 10 టన్నుల అల్లం దిగుబడినిస్తుంది.

రియో-డి-జినైరో : ఈ అల్లం దుంపల్లో ఎక్కువ తేమ శాతం కలిగి ఉండడంవల్ల తాజా అల్ల గా ఎక్కువగా ఉపయోగిస్తారు.పంట కాలం 190 రోజులు ఉండి.ఎకరాకు 8-9 టన్నులు దిగుబడినిస్తుంది.ఈ రకం అల్లం దుంప కుళ్ళు తట్టుకోలేదు కావున నీరు ఎక్కువగా నిలిచే నేలలో రకం సరిపోదు.

Share your comments

Subscribe Magazine