Agripedia

తీగజాతి పంటల సాగులో శాశ్వత పందిరి నిర్మాణం, ప్రాముఖ్యత....!

KJ Staff
KJ Staff

రైతులకు స్వల్పకాలంలో ఆదాయాన్ని సమకూర్చే తీగ జాతి కూరగాయలైన కాకర, బీర, సొర, దొండ, పొట్లకాయ వంటి కాయగూరలు సంవత్సరం పొడవునా పండిస్తూ అధిక లాభాలను పొందుతున్నారు. అయితే చాలా మంది రైతులు ఇప్పటికీ తీగజాతి పంటలను పందిరి విధానంలో కాకుండా సాధారణ పద్ధతిలో పండిస్తుంటారు. తీగజాతి పంటలను నేల మీద పాకించడం వల్ల వివిధ రకాల వ్యాధికారక క్రిములు, తెగుళ్ళు మొక్కలకు త్వరగా వ్యాప్తి చెంది నాణ్యమైన దిగుబడులు పై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ప్రస్తుత కాలంలో దీనికి పరిష్కార మార్గంగా
అందుబాటులోకి వచ్చిన శాశ్వత పదిళ్ళ నిర్మాణం ఒకసారి పెట్టుబడితో దీర్ఘకాలంపాటు తీగజాతి పంటలను సాగు చేస్తూ అధిక నాణ్యమైన దిగుబడులు సాధించ వచ్చు. ఒక ఎకరా విస్తీర్ణంలో శాశ్వత పందిరి నిర్మాణానికి దాదాపు రెండు నుంచి రెండున్నర లక్షలు ఖర్చవుతుంది.శాశ్వత పందిరి నిర్మాణం ఎలా నిర్మించుకోవాలి ఇప్పుడు చూద్దాం.

ఎకరా విస్తీర్ణంలో పందిరి నిర్మాణానికి 10 అడుగుల పొడవు, 6.8 అంగుళాల మందం కలిగిన రాతి స్తంభాలు లేదా సిమెంటు దిమ్మలు 220 అవసరం అవుతాయి. అదే వరుసల మధ్య 18 అడుగులు, స్తంభాల మధ్య14 అడుగులు ఎడం ఉంచినట్లయితే 188 సిమెంటు దిమ్మెలు అవసరం అవుతాయి. అదే విధంగా 5 గేజ్ జింక్ పూత కలిగిన జి.ఐ తీగ 600 కిలోలు, 10 గేజ్ జి.ఐ తీగ 900 కిలోలు అవసరం అవుతుంది. ముందుగా నిర్ణయించుకున్న దూరంలో 14x4 లేదా18×14 2 అడుగుల గుంతలు తీసుకొని వాటిలో సిమెంటు దిమ్మెలను పాతుకోవాలి ఆ తరువాత జి.ఐ. వైరును జాగ్రత్తగా స్తంభాల మధ్య అల్లుకొన్నట్లయితే శాశ్వత పందిరి నిర్మాణం తయారవుతుంది.

Share your comments

Subscribe Magazine