Agripedia

వేసవి తీగ జాతి కూరగాయ పంటల సాగులో మెలకువలు!

Srikanth B
Srikanth B

వేసవి లో ఆరోగ్యం విషయంలో చాల శ్రద్ద తీసుకోవాలి. లేనట్లయితే వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశo వున్నది. దీనికి నివారణగా, ఆహారంలో వేసవి లో లభించే కూరగాయలను చేర్చుకోవడం వలన ఎండా, వేడి మరియు డిహైడ్రేషన్ సమస్యల నుండి కాపాడుకోవచ్చు.

వేసవి లో ఎ కూరగాయ పంటను పండించినా డిమాండ్ అధికంగానే వుంటుంది. కాని వేసవి లో సాధారణంగా వుండే అదిక ఉష్ణోగ్రత, వాతావరణంలో వుండే తక్కువ తేమ, నీటి పారుదల సౌకర్యం సరిపడినంత లేకపోవడం, విధ్యుత్ సరఫరా లో అంతరాయం మొదలగునవి పంటల సాగుకు ప్రతిబంధకమౌతాయి. అంతే కాకుండా వేసవి లో వడ గాల్పుల వలన మొక్క పెరుగుదల తక్కువగా వుండి, పూత పిందే ఏర్పడినప్పటికీ రాలిపోయే ప్రమాదం వుండి, తద్వారా దిగుబడులు కూడా గణనీయంగా తగ్గుతాయి.
ఐతే వేడిని తట్టుకునే రకాల ఎంపికతో పాటు సరైన యాజమాన్య పద్దతులు పాటించినట్లయితే వేసవి కూరగాయల సాగు ద్వారా మంచి దిగుబడి మరియు ఆదాయం పొందవచ్చు.

రకాల ఎంపిక

బీరలో పుసా నసదర్, సొర లో పూసా సమ్మర్ ప్రోలిఫిక్ లాంగ్, అర్క బహార్ మరియు కాకరలో కొయంబత్తోర్ లాంగ్ గ్రీన్, మరియు అర్క హరిత రకాలు అనువైనవి.
సాగు విధానం

వేసవి లో మొక్క పెరుగుదల తక్కువగా వుంటుంది కావున తక్కువ దూరంలో విత్తనాన్ని విత్తుకోవాలి. తీగ జాతి పంటలలో 2.0 X 0.5 మీ. దూరంలో నాటుకోవాలి.
కొత్తగా నాటిన మామిడి, జామ, కొబ్బరి వంటి 3-4 సంవత్సరాల తోటలలో అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్దిని చేయవలెను. ఒక కిలో విత్తనానికి 3 గ్రా. కాప్టన్ లేదా థైరం మరియు 5 గ్రా. ఇమిడాక్లోప్రిడ్ తో విత్తన శుద్ది చేయవలెను.

నేలలోని తేమను సంరక్షించడానికి వీలైనంత ఎక్కువ మోతాదులో సేంద్రీయ ఎరువుల వినియోగించాలి. దీనివలన నేల గుల్ల బారి తేమను పట్టి వుంచి మొక్కకు అందుబాటులో వుండే విధంగా చేస్తుంది. పాదులలోను మరియు వరుసల మద్య వరి గడ్డిని కాని ఎండుటాకులు వేసినట్లయితే నేల లోని తేమ సమక్షించాబడి ఎక్కువ రోజులు మొక్కకు నీరందుతుంది మరియు కలుపు సమస్య తగ్గుతుంది. వున్న కొద్ది పాటి తేమను బిందు లేదా తుంపర్ల పద్దతిలో ఇవ్వడం వలన తక్కువ నీటితో ఎక్కువ కూరగాయలను పండించవచ్చు.

తీగ జాతి కూరగాయ పంటలలో అధిక ఉషోగ్రత కు మగ పుష్పాలు ఎక్కువగా వచ్చే అవకాశం వుంది. దీని నివారణగా మొక్క 2-4 ఆకుల దశలో 3-4 గ్రాముల బొరాక్స్ లీటరు నీటికి కలిపి వారం వ్యవదిలో రెండు సార్లు పిచికారి చేయవలెను. దీని ద్వార తరువాత దశలో ఆడ పుష్పాలు ఎక్కువగా వచ్చి దిగుబడి కూడా పెరిగే అవకాశం వుంది లేదా పూత దశలో సైకోసెల్ 2.5 గ్రా. లేదా మాలిక్ హైడ్రజైద్ ను 0.5 గ్రా. 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయవలెను.
కూరగాయలను చల్లటి వేళ కోసి, జాగ్రత్తగా కాయలోని తేమ పోకుండా మార్కెట్ కు పంపవలెను.


Author :

డా. వి. మంజు వాణి (ఉద్యాన విభాగం), డా. కే. రేవతి, డా. ఎమ్. వెంకట లక్ష్మి, జే. యశ్వంత్ కుమార్, డా. బి. నవీన్, జి. కృష్ణ వేణి, డా. పి. శ్రీలత
కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటశాల, కృష్ణా జిల్లా - 521133

Related Topics

vegitableprice

Share your comments

Subscribe Magazine