Agripedia

మామిడి తోట యాజమాన్యం , నిర్వహణ !

S Vinay
S Vinay


పండ్ల తోటల పెంపకంలో పండ్ల రారాజు మామిడిది ప్రత్యేక స్థానం ఉంది, రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్,తెలంగాణ లో విస్తారంగా మామిడి తోట సాగు చేయబడుతుంది. మన రాష్ట్రాలలో పండే మామిడికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. మామిడి పండ్ల అధిక దిగుబడిని సాధించడానికి అవసరమయ్యే విషయాలను తెలుసుకుందాం

అనువైన నేలలు:
మామిడికి ముఖ్యంగా ఎర్ర నేలలు,లోతైన నేలల్లో అధిక దిగుబడి ఉంటుంది, ఉదజని సూచిక 7.5 నుండి 8 వరకు ఉండేట్లు చూసుకోవాలి
నీటి పారుదలకి అనువుగా ఉండాలి. నల్లరేగడి,చౌడునేలలు ఇంకా నీరు నిలువ వుండే నేలలు అనువైనవి కావు. నేలను మూడు సార్లు బాగా దున్నుకోవాలి. మొక్కలను నాటే ముందు గుంతలలో పశువుల ఎరువును వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

మామిడి రకాలు:
బంగినపల్లి,తోతాపురి ,చిన్న రసం,పెద్ద రసం మరియు చెరుకు రసం వంటివి అన్ని ప్రాంతాల వాతవరణ పరిస్థితులకి అనువైనవి అవేకాకుండా కేసరి, సువర్ణ రేఖ ,దశేరి వంటి రకాలు కూడా ఉన్నాయి.
సంకర రకాలు (హైబ్రిడ్ రకం):ఇందులో ముఖ్యంగా ఆమ్రపాలి,రత్న,ఆర్కా పునీత్ మరియు సింధు వంటి రకాలు ఉన్నాయి

పండ్ల తోటల పెంపకంలో పండ్ల రారాజు మామిడిది ప్రత్యేక స్థానం ఉంది, రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్,తెలంగాణ లో విస్తారంగా మామిడి తోట సాగు చేయబడుతుంది. మన రాష్ట్రాలలో పండే మామిడికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. మామిడి పండ్ల అధిక దిగుబడిని సాధించడానికి అవసరమయ్యే విషయాలను తెలుసుకుందాం.

నీటి యాజమాన్యం:
మొక్క దశలో ఉన్నప్పుడు మూడు నుండి నాలుగు రోజులకి ఒకసారి నీరు పెట్టాలి,పూత దశ మరియు పిందెలు కాసే దశ మామిడి కి చాలా ముఖ్యమైనది ఈ సమయంలో నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలి. చెట్లపాదుల్లో ఎండుగడ్డి ఎండిన ఆకులు, మరియు వాడేసిన కొబ్బరిబోండాలు లాంటివి వేసి కప్పి ఉంచాలి దీనివల్ల కలుపు మొక్కల నివారణ సులభం అవుతుంది మరియు తగినంత తేమ అందుబాటులో ఉంటుంది.

ఎరువులు:
ఆయా ప్రాంతాల్లో వున్న వాతావరణ పరిస్థితులని బట్టి ఎరువులను చల్లుకోవాలి
తక్కువ వర్షపాతం గల ప్రదేశాల్లో వర్షా కాలం ప్రారంభంలోనూ ,తర్వాత వర్షా కాలం చివరిలోను వెయ్యాలి. వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వర్షాకాలం చివర్లో వేసుకోవాలి.

సూక్ష్మ పోషక లోపాలు :
మామిడితోటలో జింక్ లోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి వక్కువగా ఉన్నాయి దీని నివారణకై లీటరు నీటికి 5 గ్రా, జింక్సల్ఫేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇనుప ధాతు లోపం వచ్చినట్లైతే చెట్ల ఆకులు పచ్చదనం కోల్పోయి తెల్లగా పాలిపోతాయి దీని నివారణకు 2.5 గ్రా, పెర్రస్ సల్ఫేట్ని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.

 

కలుపు నివారణ :
మామిడితోటలో కలుపు నివారణకై అంతర కృషి చేయాలి సంవత్సరానికి కనీసం రెండు సార్లు నేలను కలియ దున్నాలి చెట్ల మధ్యలో కలుపు రాకుండా జాగ్రత్త పడాలి. గడ్డి జాతి తుంగ జాతి వంటి కలుపుని ఎదుర్కోవడానికి పారాక్వాట్ 8 మీ.లీ లేదా అమోనియం సల్ఫేట్ 20 గ్రాముల చొప్పున లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి. మామిడి మొక్కలపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

కొమ్మల కత్తిరింపు :
మామిడితోటలో కత్తిరింపు చాలా ముఖ్యమైనది, బాగా గుబురుగా పెరిగిన చెట్టు కొమ్మల ఆకుల వలన సరైన సూర్యరక్ష్మి చెట్లకి అందక పండ్లని తయారుచేసుకునే సామర్ధ్యాన్ని కోల్పోతాయి. కోమ్మలను కత్తిరించటానికి సిగేచర్,లాఫర్ వంటి పరికరాలను వాడాలి

తెగుళ్లు: తెగుళ్లు మామిడి మొక్కలకి విపరీతమైన నష్టాన్ని చేకూరుస్తాయి ఇందులో ప్రధానంగా బూడిద తెగులు మరియు మచ్చ తెగులు ఉన్నాయి బూడిద తెగులు ఎక్కువగా వాతావరణం చల్లగా తేమగా ఉన్నప్పుడు వస్తుంది దీని నివారణకై గంధకాన్ని 3గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పూతకి ముందు పూతకి తర్వాత మరియు పిండే దశ లో వున్నప్ప్పుడు పిచికారీ చేసుకోవాలి

అంతర పంటలు:
థాక్క్కువ ఎత్తు పెరిగే కూరగాయలను పండించి ఆర్ధిక లబ్దిని పొందవచ్చు టమాటా, బెండకాయ,దోసకాయ,చిక్కుడు వంటి కూరగాయలను పెంచవచ్చు ఇవే కాకుండా బొప్పాయి,జామ మరియు సీతాఫలం వంటి వాటిని అంతర పంటలుగా వేసుకోవచ్చు.

వరి సాగు యాజమాన్య పద్ధతులు!

Related Topics

mango mango cultivation

Share your comments

Subscribe Magazine